ప్రాణంగా చూసుకుంటే.. యజమాని ప్రాణం తీసిన పెంపుడు సింహం..

సింహాలను పెంచుకోవడానికి మైఖెల్‌కు అనుమతి లేదు. చట్టవ్యతిరేకంగా అతడు సింహాలను పెంచుకుంటున్నట్టు చెప్పారు.

news18-telugu
Updated: March 6, 2019, 12:15 PM IST
ప్రాణంగా చూసుకుంటే.. యజమాని ప్రాణం తీసిన పెంపుడు సింహం..
నమూనా చిత్రం
  • Share this:
సింహాన్ని ప్రాణంగా చూసుకుని, దాని ఆలనా పాలనా చూసుకుంటున్న యజమాని ఉసురుతీసింది ఆ మృగం. చెక్ రిపబ్లిక్‌ దేశంలో ఈ ఘటన జరిగింది. చెక్ రిపబ్లిక్‌లోని వెస్టిన్ జిల్లాలో మైఖెల్ ప్రాసిన్ అనే వ్యక్తి 2016 నుంచి ఓ సింహాన్ని పెంచుకుంటున్నాడు. ఏడాది క్రితం ఓ ఆడసింహాన్ని కూడా తీసుకుని వచ్చాడు. ఆ రెండింటిని జతకట్టించి బుల్లి సింహాలు పుడితే వాటిని కూడా పెంచుకోవాలనుకున్నాడు. ఆ రెండింటినీ వేర్వేరు బోనుల్లో పెట్టి.. వాటిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అయితే, ఆ పెంపుడు సింహమే అతని ప్రాణం తీసింది.

czech,czech republic,lion,lioness,pet lion, చెక్ రిపబ్లిక్, యజమానిని చంపిన సింహం, సింహాన్ని పెంచుకున్న యజమాని,
ప్రతీకాత్మక చిత్రం


మైఖెల్ ప్రాసిన్ తండ్రి బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కొడుకు కనిపించలేదు. సింహాల దగ్గరే ఉంటాడనుకుని వెళ్లి చూస్తే షాక్ తిన్నాడు. రక్తపు మడుగులో మగ సింహం వద్ద తన కొడుకు శవమై కనిపించాడు. ఆ బోనులోపల గడియ పెట్టి ఉంది. కనీసం ఆ శవాన్ని బయటకు తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు. దీంతో మైఖెల్ తండ్రి పోలీసులకు ఫోన్ చేశాడు. వారు కూడా సింహాల బోనులో ఉన్న మైఖెల్ శవాన్ని బయటకు లాగడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు ఆ రెండు సింహాలను కాల్చేసి.. అనంతరం డెడ్‌బాడీని బయటకు తీసుకొచ్చారు.

czech,czech republic,lion,lioness,pet lion, చెక్ రిపబ్లిక్, యజమానిని చంపిన సింహం, సింహాన్ని పెంచుకున్న యజమాని,
సింహం (Reuters)


సింహాలను పెంచుకోవడానికి మైఖెల్‌కు అనుమతి లేదు. చట్టవ్యతిరేకంగా అతడు సింహాలను పెంచుకుంటున్నట్టు చెప్పారు. ఇరుగుపొరుగువారు ఈ విషయం మీద ఫిర్యాదు చేసినా.. అధికారులు ఎవరినీ తన ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకునేవాడని స్థానికులు తెలిపారు. అయితే, చివరకు తాను పెంచిన సింహం చేతిలోనే చనిపోతాడని తాము ఊహించలేదని బాధపడుతున్నారు.
First published: March 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading