హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

యజమాని కోసం ఆసుపత్రి వద్ద పడిగాపులు కాసిన శునకం.. ఇంతకీ ఏమైంది?

యజమాని కోసం ఆసుపత్రి వద్ద పడిగాపులు కాసిన శునకం.. ఇంతకీ ఏమైంది?

కేంద్ర ప్రభుత్వం మూగజీవాల సంరక్షణ కోసం చట్టంలో కొన్ని మార్పులు చేస్తోంది. 60 ఏళ్ల నాటి చట్టానికి సంస్కరణలు తీసుకొస్తోంది.

కేంద్ర ప్రభుత్వం మూగజీవాల సంరక్షణ కోసం చట్టంలో కొన్ని మార్పులు చేస్తోంది. 60 ఏళ్ల నాటి చట్టానికి సంస్కరణలు తీసుకొస్తోంది.

మనుషుల కంటే కక్కలు ఎంతో విశ్వాసం కలిగినవి అనే సంగతి వేరే చెప్పనక్కర్లేదు. కాస్త ఆహారమిస్తే రోజంతా మనకోసమే ఎదురుచూస్తుంటాయి.

మనుషుల కంటే కక్కలు ఎంతో విశ్వాసం కలిగినవి అనే సంగతి వేరే చెప్పనక్కర్లేదు. కాస్త ఆహారమిస్తే రోజంతా మనకోసమే ఎదురుచూస్తుంటాయి. ఇలా విశ్వాసాన్ని చాలా సార్లు నిరూపించుకున్న ఉదాహరణలు మరో చూశాం. తాజాగా మనుషుల పట్ల విశ్వాసాన్ని మరోసారి నిరూపించింది ఓ కుక్క. తన యజమానికి జబ్బు చేస్తే రోజుల తరబడి ఆసుపత్రి బయట ఎదురు చూసింది. ఈ సంఘటన సంబంధించి పలు ఫొటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. టర్కీలో సముద్ర నగరమైన ట్రాబ్ జోన్ కు చెందిన సెమల్ సెంటుర్క్ కు బోనుక్ అనే శునకం ఉంది. ఈ నెల 14న ఆయన అనారోగ్యానికి గురవగా కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.

అంబులెన్సులో సెమల్ ను తీసుకెళ్లడం గమనించిన బొనుక్ ఆ వాహనాన్ని వెంబడించి ఆసుపత్రికి చేరుకుంది. యజమాని కోసం రోజంతా వేచి చూసింది. చివరకు సెమల్ కుమార్తె ఐనూర్ ఎగెలి రాత్రి వేళ కుక్కను ఇంటికి తీసుకెళ్లారు. అయితే మళ్లీ మరునాడు ఉదయం ఆసుపత్రి వద్దకు వచ్చి యజమాని కోసం తలుపు వద్దే నిరీక్షించి రాత్రికి ఇంటికి వెళ్లింది. ఇలా వారం రోజుల పాటు పడిగాపులు కాసింది.

చివరకు ఈ నెల 20 కోలుకున్న సెమల్ ను వైద్యులు డిశ్చార్జి చేశారు. దీంతో వీల్ చైర్లో ఆసుపత్రి తలుపు వద్దకు వచ్చి తన శునకాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోవడమే కాకుండా ఆనందంతో పరవశించిపోయారు. కుక్కతో కలిసి ఇంటికి చేరుకున్నారు. బోనుక్ ను వారం రోజుల పాటు మిస్ అయినట్లు ఆయన తెలిపారు. కుక్కంటే తనకు ఎంతో ఇష్టమని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇలాంటి సంఘటనలు చాలా సార్లు వార్తల్లో వినిపించాయి. గతేడాది చైనా సోషల్ మీడియా సైట్స్ లో ఓ కుక్క తన యజమాని కోసం ఓ వంతనె వద్ద రోజుల తరబడి ఎదురుచూసిన హృదయ విదారకరమైన సంఘటన అప్పట్లో వైరల్ అయింది.

హాలివుడ్ లో హాచీ డాగ్స్ టేల్ అనే చిత్రం కూడా కుక్క గురించే ఉంటుంది. చనిపోయిన తన యజమాని కోసం రోజుల తరబడి రైల్వేస్టేషన్ లో ఎదురుచూసిన ఓ శునకం కథ అది. అయితే ఈ సినిమా కూడా నిజ జీవితం ఆదారంగా తీసిందే. ఈ విధంగా పలు హృదయ విదారకర సంఘటనలు దైనందిన జీవితంలో చాలాసార్లు తారసపడతాయి.

Published by:Sumanth Kanukula
First published:

Tags: Dog, Turkey

ఉత్తమ కథలు