పాక్ ఆర్మీ గుణపాఠం చెబుతుంది.. భారత్‌కు ముషారఫ్ హెచ్చరిక..

Pak warns India : పాకిస్తాన్‌లో తన పార్టీని మళ్లీ యాక్టివ్ చేయాలని ముషారఫ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2016లో వ్యాధి చికిత్స కోసం దుబాయ్ వెళ్లిన ముషారఫ్.. అప్పటినుంచి అక్కడే ఉంటున్నారు.

news18-telugu
Updated: October 7, 2019, 3:52 PM IST
పాక్ ఆర్మీ గుణపాఠం చెబుతుంది.. భారత్‌కు ముషారఫ్ హెచ్చరిక..
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (File)
news18-telugu
Updated: October 7, 2019, 3:52 PM IST
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు,ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్(APML) వ్యవస్థాపకుడు పర్వేజ్ ముషారఫ్ భారత్‌కు వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్‌పై భారత్ ఏదైనా దుశ్చర్యకు పూనుకుంటే పాక్ సైన్యం తగిన గుణపాఠం చెబుతుందన్నారు. పాకిస్తాన్ జవాన్లు తమ చివరి రక్తపు బొట్టు వరకు భారత్‌తో పోరాడుతారన్నారు. అంతేకాదు, భారత్ కార్గిల్ వార్‌ని మరిచిపోయినట్టుందని పరిహాసమాడారు. ఆదివారం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇస్లామాబాద్‌లో నిర్వహించిన చేసిన ఓ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దుబాయ్ నుంచి ముషారఫ్ మాట్లాడారు.

కాగా,పాకిస్తాన్‌లో తన పార్టీని మళ్లీ యాక్టివ్ చేయాలని ముషారఫ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2016లో వ్యాధి చికిత్స కోసం దుబాయ్ వెళ్లిన ముషారఫ్.. అప్పటినుంచి అక్కడే ఉంటున్నారు. 2007లో రాజ్యాంగాన్ని రద్దు చేసినందుకు గాను ఆయనపై నమోదైన రాజద్రోహం కేసు
ఇప్పటికీ వెంటాడుతోంది. ఆ సమయంలో చాలామంది జడ్జిలను నిర్బంధించడంతో పాటు వందల మంది న్యాయమూర్తులను రాజ్యాంగ విరుద్దంగా తొలగించారు.ఇవన్నీ పక్కనపెడితే.. భారత్‌పై ముషారఫ్ తాజా కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. భారత్ వైపు నుంచి ఈ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఎదురయ్యే అవకాశం ఉంది.First published: October 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...