PEOPLE SELLING KIDNEYS IN POVERTY IN AFGHANISTAN SNR
అఫ్ఘనిస్తాన్ని వెక్కిరిస్తున్న పేదరికం..అవయవాల్ని అమ్ముకుంటున్న ప్రజలు
ప్రతీకాత్మకచిత్రం
Afghanistan: తాలిబన్ల ఆరాచక పాలనలో అఫ్ఘనిస్తాన్‌లో పేదరికం వెక్కిరిస్తోంది. ఉపాధి లేక, పొరుగు దేశాల సహకారం కొరవడంతో చాలా మంది కుటుంబాల్ని పోషించుకునేందుకు ప్రాణాల్ని పణంగా పెడుతున్నారు. తమ శరీరంలోని కిడ్నీలను అమ్ముకొని భార్య, పిల్లల్ని పోషించుకుంటున్నారు.
తాలిబన్లు పరిపాలన కొనసాగిస్తున్న ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)లో పేదరికంpoverty వెక్కిరిస్తోంది. అక్కడి ప్రజల్లో చాలా మందికి ఉపాధి కరువైంది. ఈ కారణంగానే చాలా మందికి పనులు దొరక్కపోవడంతో తమ కుటుంబాల్ని పోషించుకునేందుకు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి..శరీరంలోని అవయవాల(Vital organs)ను అమ్ముకుంటున్నారు. ఇంతటి దయనీయ పరిస్థితి అక్కడి వాళ్లను పేదవాళ్లగానే కాకుండా అనారోగ్యవంతులుగా మార్చడానికి కారణవుతోంది. ముఖ్యంగా పశ్చిమ ప్రావిన్స్‌లోని హెరాత్ ( Herat province)ప్రాంతానికి చెందిన చాలా మంది తమ భార్య, పిల్లలకు అన్నం పెట్టడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి నెలకొంది. మరికొందరు వలసలు వెళ్లేందుకు అప్పులు చేసి వాటిని తీర్చడానికి శరీరంలోని కిడ్నీలు అమ్ముకోవాల్సిన దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోహ్సన్ (Kohsan District)జిల్లాలోని ఖుదూసాబాద్( Qudoosabad village)కి చెందిన గులాం హజ్రత్ (Ghulam Hazrat)అనే 40సంవత్సరాల (40Year-old)వయసు కలిగిన వ్యక్తి తన కుటుంబాన్ని పోషించుకునేందుకు కిడ్నీని అమ్ముకున్నాడు. ఇండియన్ కరెన్సీ లెక్కలో చూస్తే 2లక్షల 30వేలకు (Rs230,000)తన కిడ్నీని విక్రయించినట్లుగా హజ్రత్ తెలిపాడు. కుటుంబ పోషణే కాదు ఇరాన్‌కి వలస కార్మికుడిగా వెళ్లేందుకు చేసిన అప్పు కూడా చెల్లించాల్సి రావడంతో తన శరీరంలోని అవయవాన్ని అమ్ముకున్నానని చెప్పాడు. ఆప్ఘనిస్తాన్‌లో ఒక్క హజ్రత్ మాత్రమే కాదు..ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని చెబుతున్నారు ఆఫ్గన్ ఆర్యా హాస్పిటల్ డాక్టర్లు.
కిడ్నీలు అమ్ముకునేలా చేస్తున్న పేదరికం..
గతేడాదిలో 85కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్లు చేశారు వైద్యులు. అయితే ఇదంతా కిడ్నీలు అమ్ముకునే వాళ్ల ఆర్ధిక పరిస్థితుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం లేదని..దాత, కొనుగోలుదారుల ఒప్పదంతోనే మూత్రపిండాల ఆపరేషన్లు చేస్తున్నట్లుగా వెల్లడించారు డాక్టర్ నాసిర్ అహ్మద్. ఈ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ కోసం సుమారు 6లక్షల నుంచి 8లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటున్నారు డాక్టర్లు. దాతల బ్లడ్ గ్రూప్‌లను బట్టీ కిడ్నాలు విలువ రెండు లక్షల రూపాయల నుంచి 4లక్షల వరకూ ఉంటోంది. ఇక ఆసుపత్రి ఖర్చులు, పేషెంట్‌కి అవసరమయ్యే మందులు, దాతకు చేయాల్సిన టెస్ట్‌లతో కలిపి మొత్తం 4లక్షలు ఖర్చు అవుతోందని వెల్లడించారు డాక్టర్లు.
తాలిబన్ల అరాచకంతో మొదలైంది..
అయితే కిడ్నీలను అమ్ముకునేందుకు వస్తున్న వాళ్లంతా తమ తాత్కాలిక ఆర్ధిక అవసరాలను మాత్రమే చూసుకుంటున్నారని..ఆపరేషన్ తర్వాత తలెత్తే శాశ్వత అనారోగ్య సమస్యలను ఆలోచించడం లేదని డాక్టర్లు వాపోతున్నారు. అఫ్ఘనిస్తాన్‌లో కిడ్నీ దానం చేసే సంస్కృతి ఇంకా పెరగడం సరికాదని సూచిస్తున్నారు డాక్టర్లు.
ఆప్ఘనిస్తాన్‌కి సాయం చేసేవారే లేరా..
ఆఫ్ఘనిస్తాన్‌లో నిరాశ్రయుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గతేడాది ఆగస్ట్ నెలలో అమెరికా, నాటో దళాలు అఫ్ఘనిస్తాన్ని వదలివెళ్లడంతో అక్కడ తాలిబాన్లు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అయితే తాలిబన్లు అధికారం చేపట్టడం ఇష్టం లేకపోవడంతో అంతర్జాతీయ సమాజం ఆఫ్ఘనిస్తాన్ ఆర్ధిక లావాదేవీలను నిలిపివేయడంతో పాటు ఎలాంటి సహాయ, సహకారాలు ఇవ్వమని తేల్చి చెప్పాయి. దీంతో అఫ్ఘనిస్తాన్‌లో గతం కొద్ది రోజులుగా ఇలాంటి దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలోనే ఐక్యరాజ్యసమితి ఆఫ్ఘన్‌తో పాటు పొరుగున్న ఉన్న దేశాలకు కొంత ఆర్ధిక సహాయాన్ని ప్రకటిచింది.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.