Home /News /international /

PEOPLE EVEN TRYING TO TRAVEL ON FLIGHT ENGINE IN AFGHANISTAN VIDEO BECOME VIRAL AK

Viral Video: ఆఫ్ఘన్‌లో టెన్షన్ టెన్షన్.. విమానం ఇంజిన్ మీద కూర్చుని ప్రయాణం.. వీడియో వైరల్

కాబూల్ ఎయిర్‌పోర్టులో కనిపిస్తున్న దృశ్యాలు

కాబూల్ ఎయిర్‌పోర్టులో కనిపిస్తున్న దృశ్యాలు

Afghanistan ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్‌లో ప్రస్తుతం భయానకమైన పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని ఇలాంటి దృశ్యాలు చెప్పకనే చెబుతున్నాయి.

    తాలిబన్లు ఆప్ఘనిస్థాన్‌ను పూర్తిస్థాయిలో హస్తగతం చేసుకోవడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సాక్ష్యాత్తూ ఆ దేశ అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లిపోగా.. మిగతా దేశానికి చెందిన పౌరులు సైతం స్వదేశాలకు వెళ్లిపోతున్నారు. కేవలం విదేశాలకు చెందినవాళ్లు మాత్రమే కాదు.. తాలిబన్ల పాలనలో ఉండలేమని భావిస్తున్న చాలామంది ఆఘ్గన్లు సైతం దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో విమానం ఎక్కేందుకు పోటీ పడుతున్నారు. మన దగ్గర సిటీ బస్సుల్లో ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడే విధంగా.. విమానాల్లో ఎక్కేందుకు అక్కడి ప్రజలు పోటీపడుతున్నారు. ఎలాగోలా దేశం విడిచి వెళితే చాలు అన్నట్టుగా ఉంది వారి పరిస్థితి. ఎయిర్‌పోర్టులో గొడవలు జరుగుతున్నా.. విమానంలో చోటు దొరికితే చాలు అన్నట్టుగా ఉంది అక్కడి ప్రజల పరిస్థితి.



    ఈ క్రమంలో విమానంలో చోటు దొరకని కొందరు యువకులు.. విమానం బయట ఇంజిన్ మీద కూర్చుని ప్రయాణించేందుకు కూడా సిద్ధపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా ప్రయాణించేందుకు ప్రయత్నించిన కొందరు కింద పడిపోయినట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్‌లో ప్రస్తుతం భయానకమైన పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని ఇలాంటి దృశ్యాలు చెప్పకనే చెబుతున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Afghanistan, Taliban

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు