ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న 'ఇన్విజిబుల్ ఛాలెంజ్'

మెజీషియన్ జస్టిన్ విల్‌మన్‌‌ 'ఇన్‌విజిబుల్' మ్యాజిక్ ట్రిక్ వైరల్‌గా మారింది. #InvisibleChallenge హ్యాష్‌ట్యాగ్‌తో వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి.


Updated: September 10, 2018, 3:48 PM IST
ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న 'ఇన్విజిబుల్ ఛాలెంజ్'
Image credits: @yulissac48 / Twitter
  • Share this:
ఇంటర్నెట్‌లో ఛాలెంజ్‌ల పేరుతో జరిగే హంగామా తెలియనిదికాదు. మొన్నామధ్య కీకీ ఛాలెంజ్‌ ఏ రేంజ్‌లో పాపులర్ అయిందో, ఏ స్థాయిలో వివాదాస్పదమయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్తగా 'ఇన్విజిబుల్ ఛాలెంజ్' వైరల్‌గా మారింది. మెజీషియన్ జస్టిన్ విల్‌మన్‌‌ 'ఇన్‌విజిబుల్' మ్యాజిక్ ట్రిక్ ఇప్పుడిలా వైరల్‌గా మారింది. మెజీషియన్ జస్టిన్ విల్‌మన్ గత నెలలో నెట్‌‌ఫ్లిక్స్ షో కోసం 'ఇన్‌విజిబుల్' ప్రాంక్ చేశాడు. ఆ ప్రాంక్‌ అందర్నీ నవ్వించింది. ఆశ్చర్యపర్చింది. ఆ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.అసలు అందులో ప్లాన్ ఏంటంటే... అక్కడ ప్రేక్షకులంతా మెజీషియన్ మనుషులు. అందరూ కలిసి ఓ వ్యక్తిని మాయం చేసినట్టు నటిస్తారు. అతడిని నమ్మించేందుకు సెల్ఫీ కూడా తీసుకుంటారు. ఆ సెల్ఫీలో మాయమైన వ్యక్తి మాత్రం కనిపించడు. ఈ వీడియో యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన మూడు వారాల్లో 40 లక్షల మంది చూశారు.

అంతే కాదు... 'ఇన్విజిబుల్ ఛాలెంజ్' కూడా మొదలైంది. #InvisibleChallenge హ్యాష్‌ట్యాగ్‌తో వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. మెజీషియన్ జస్టిన్ విల్‌మన్‌ను స్ఫూర్తిగా తీసుకొని నెటిజన్లు ఎలా ప్రాంక్ చేశారో చూడండి.

ఇవి కూడా చదవండి:

ఫోర్ట్‌నైట్ గేమ్: 21 రోజుల్లో 2.3 కోట్ల యూజర్స్

బీపీ చెక్ చేసే ఐఫోన్ యాప్!

89 ఏళ్ల వయస్సులో పీహెచ్‌డీ ఎంట్రెన్స్!

మోటో జీ6 ప్లస్ వచ్చేసింది!

ఐదు నెలల గర్భిణీ ర్యాంప్ వాక్!

Video: డెక్కన్ ఒడిస్సీ: ఆసియాలోనే లగ్జరీ ట్రెయిన్

Video: ఆరోగ్యం కోసం 10 సూపర్‌ఫుడ్స్!

 
First published: September 10, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading