Home /News /international /

PEGASUS NSO ENDED CONTRACT WITH UAE OVER DUBAI RULER HACKING ON EX WIFE PRINCESS HAYA MKS

మాజీ భార్యపై మోజుతో అడ్డంగా బుక్కైన Dubai రాజు -UAEతో Pegasus NSO డీల్ రద్దు -శిక్ష పడేనా?

దుబాయ్ రాజు మక్తూమ్‌, మాజీ భార్య హయా

దుబాయ్ రాజు మక్తూమ్‌, మాజీ భార్య హయా

NSO Ended Contract With UAE: మాజీ భార్య హయా పట్ల దుబాయ్ రాజు మక్తూమ్ కనబర్చిన అతి ఆసక్తి ఇప్పుడాయన దేశాన్నే చిక్కుల్లోకి నెట్టేసింది. మాజీ భార్యపై మోజుతో ఆమె కదలికలపై కన్నేసిన రాజావారు.. పెగాసస్ స్పైవేర్ ద్వారా ఆమె ఫోన్ ను హ్యాక్ చేశారు. ఆమెతో ఎక్కవగా మాట్లాడే లండన్ లాయర్ ఫోన్ పైనా నిఘా పెట్టారు. ఈ విషయం బట్టబయలు కావడంతో పెగాసస్ ను తయారుచేసిన ఎన్ఎస్ఓ సంస్థ ఏకంగా యూఏఈతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది...

ఇంకా చదవండి ...
అప్పటికీ ఆమె.. అతనికి ఆరో భార్య.. అనుకోని పరిస్థితుల్లో ఒక్కటై, పిల్లల్ని కన్నా, అనివార్యంగా అతనితో జీవించడానికి ఆమె ఇష్టపడలేదు.. పకగ్బందీ రాజబంధనాలు తెంచుకొని మరీ.. పిల్లల్ని వెంటబెట్టుకుని బాడీగార్డుల సాయంతో విదేశాలకు పారిపోయింది. అంతే, గల్ఫ్ దేశాలు గొల్లుమన్నాయి.. రాజుకు తలకొట్టేసినట్లయింది.. పిల్లలపై హక్కుల కోసం లండన్ కోర్టు పేషీ మొదలైంది.. ఈ మాజీ భార్యాభర్తల పంచాయితీని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.. అంతలోనే మాజీ భార్య పట్ల రాజుగారి అబ్సెషన్ తాలూకు చీకటి కోణాలెన్నో వెలుగులోకి వచ్చాయి.. ఇప్పుడాయన విదేశీ కోర్టులో ఆల్మోస్ట్ దోషిగా తేలాడు.. ఆ దెబ్బకు విదేశీ సంస్థలు రాజుగారి దేశంతో ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి... వివరాల్లోకి వెళితే..

ఆమె ఫ్లాట్ పక్కనే మరో పోర్షన్..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశంలోని ఏడు రాజప్రసాదాల్లో అతి కీలకమైన దుబాయ్ (Dubai)కి పాలకుడిగా ఉన్న షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ మరోసారి అంతర్జాతీయంగా పతాక శీర్షికలకెక్కారు. కారణం.. మాజీ భార్య పట్ల ఎడతెగని వ్యామోహం. మూడేళ్ల కిందట ఆయను ఛీకొట్టి లండన్ పారిపోయింది ప్రిన్సెస్ హయా బిన్ట్‌ అల్‌ హుస్సేనీ. బ్రిటన్ సర్కారు అతిథిగా లండన్ లో మర్యాదలు పొందుతోన్న ఆమె.. పిల్లలపై హక్కుల విషయంలో లండన్ కోర్టు నుంచే భర్తతో న్యాయపోరాటం చేస్తున్నది. అయితే, రాజుగారు మాత్రం అడ్డదారిలో మాజీ భార్య గుట్టు లాగేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. అంతేకాదు, ఆమె ఫ్లాట్ పక్కనే మరో ఫ్లాట్ ను బుక్ చేసి ఆమె రాకపోకలపైనా నిరంతయారంగా కన్నేశాడు..మాజీ భార్యపై నిఘా

లండన్ లో ఉంటోన్న ప్రిన్సెస్ హయా ఎక్కడెక్కక్కడికి వెళుతోంది? ఎవరెవర్ని కలుస్తోంది? ఎవరితో ఫోన్లో మాటలు, చాటింగ్ చేస్తోంది? మాజీ భర్త గురించి ఏవైనా గుసగుసలు చెబుతోందా? అనే విషయాలు కనిపెట్టడానికి దుబాయ్ రాజు ఏకంగా అత్యాధునిక అంతర్జాతీయ నిఘాను ప్రయోగించాడు. ఆ నిఘా వ్యవస్థ పేరే పెగాసస్. అవును, భారత్ సహా డజనుకుపైగా దేశాల్లో ఆయా ప్రభుత్వాలే నిఘా కుట్రకు పాల్పడిన ఉదంతంలోని పెగాసస్ స్పైవేర్ నే దుబాయ్ రాజు కూడా వాడుకున్నాడు. కేవలం భార్యపై నిఘా పెట్టి ఊరుకుంటే దుబాయ్ రాజు చీకటి వ్యవహారం బయటికి వచ్చుండేదే కాదు.. లండన్ లో ప్రిన్సెస్ హయాకు లాయరైన ఫియోనా షాక్‌లెటన్ పైనా రాజుగారు నజర్ వేశారు. ఫియోనా మొబైల్ ఫోన్ లోకి పెగాసస్ పంపి.. అతను హయాతో ఏం మాట్లాడుతున్నాడో రాజుగారు గుట్టుగా వినేవాడు. దురదృష్టవశాత్తూ..

పెగాసస్ స్పైవేర్ వాడకం 

పెగాసస్ నిఘా కుట్రపై భారత్, బ్రిటన్ సహా చాలా దేశాల్లో పెద్ద దుమారం చెలరేగింది. ప్రభుత్వాధినేతలు తమ వ్యతిరేకులపై పెగాసస్ ను అస్త్రంగా వాడుకుంటున్నారన్న వ్యవహారం రచ్చకు దారితీసింది. ఈ విషయంలో భారత సుప్రీంకోర్టు కేంద్రం వాదనతో సమ్మతించినప్పటికీ, లండన్ కోర్డులు మాత్రం కాంప్రమైజ్ కాదేలు. పకడ్బందీ ఎంక్వైరీ చేయించగా, ప్రిన్సెస్ హయాతోపాటు ఆమె లాయర్ ఫియోనా ఫోన్లను దుబాయ్ రాజు హ్యాక్ చేశాడని తేలిసింది. ఫియోనా అసలే రాయల్ కోర్టు వ్యవస్థలో ముఖ్యుడిగా పేరొందారు. అలాంటి వ్యక్తిపై నిఘా అంటే మొత్తం బ్రిటన్ న్యాయవ్యవస్థకే తలవంపుల వ్యవహారంలా మారింది.

కుడితిలో పడ్డ ఎలుక

ప్రిన్సెస్ హయా, ఆమె లాయర్ ఫియోనాపై దుబాయ్ రాజు నిఘాకు పాల్పడినట్లు నిర్ధారణ అయిన తర్వాత వేళ్లన్నీ పెగాసస్ స్పైవేర్ ను తయారు చేసిన ఎన్ఎస్ఓ సంస్థవైపు మళ్లాయి. ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎన్ఎస్ఓ గ్రూపు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. కోర్టు విచారణపై ఎన్ఎస్ఓ సంస్థ వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది.

రాజుగారి దేశంతో డీల్ క్యాన్సిల్

ఉగ్రవాద చర్యలను అరికట్టడానికి, దేశ రక్షణ వ్యవహారాల పరిరక్షణ కోసమే తాము పెగాసస్ స్పైవేర్ అనే సాఫ్ట్ వేర్ ను తయారు చేశామని, దీన్ని ప్రైవేటు వ్యక్తులకు కాకుండా నేరుగా ఆయా దేశాల్లోని ప్రభుత్వాలే వాకునేలా ఒప్పందాలు చేసుకున్నామని ఎన్ఎస్ఏ చెప్పింది. ఒప్పందంలోని అంశాలకు విరుద్దంగా దుబాయ్ రాజు తన భార్యపై నిఘాకు పాల్పడిన కారణంగా మొత్తం యూఏఈతోనే డీల్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ఎన్ఎస్ఓ సంస్థ ప్రకటన చేసింది. ఆ విధంగా మాజీ భార్య పట్ల రాజుగారి మోజు ఆయన దేశానికే చేదు అనుభవాన్నిచ్చింది. బ్రిటన్ లో పేరు మోసిన లాయర్ పై నిఘాకు పాల్పడిన కేసులో దుబాయ్ రాజుకు కోర్టు శిక్ష విధిస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది..
Published by:Madhu Kota
First published:

Tags: Dubai, Hacking, London, Software, UAE

తదుపరి వార్తలు