Home /News /international /

PEACE IS ESSENTIAL FOR GOOD RELATIONS BETWEEN INDIA AND CHINA SAYS JAISHANKAR TO CHINESE FOREIGN MINISTER GH VB

India | China: భారత్​, చైనా విదేశాంగ మంత్రుల భేటి.. పలు విషయాలపై కీలక చర్చలు..

భారత్​, చైనా విదేశాంగ మంత్రుల భేటి

భారత్​, చైనా విదేశాంగ మంత్రుల భేటి

గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత తొలిసారిగా చైనా, భారత్ విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. శుక్రవారం మీట్ అయిన ఇరువురు మంత్రులు ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా ఎల్‌ఏసీ (LAC)లో తూర్పు లడఖ్‌లో బలగాల ఉపసంహరణ వేగవంతం చేయాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్‌ చెప్పారు.

ఇంకా చదవండి ...
గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత తొలిసారిగా చైనా, భారత్ విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. శుక్రవారం మీట్ అయిన ఇరువురు మంత్రులు ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా ఎల్‌ఏసీ (LAC)లో తూర్పు లడఖ్‌లో బలగాల ఉపసంహరణ (Disengagement Process) వేగవంతం చేయాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ (Wang Yi)కి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్‌ చెప్పారు. ఇండియా-చైనా మధ్య ఆరోగ్యకరమైన సంబంధాల (Healthy Ties) కోసం సరిహద్దులో శాంతి తప్పనిసరి అని వివరించారు. చర్చలో భాగంగా జైశంకర్ జాతీయ భావాన్ని (National Sentiment) వాంగ్ యీకి తెలియజెప్పారు. సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతత అనేవి స్థిరమైన, సహకార సంబంధాలకు పునాదిని అందించాలని చెప్పుకొచ్చారు. ద్వైపాక్షిక సంబంధాల పునాదులను బలోపేతం చేయడానికి.. రెండు దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితులను నివారించడానికి రూపొందించిన ఒప్పందాలను కూడా ఆయన ప్రస్తావించారు.

Srilanka Crisis: కిలో చికెన్ 1200.. బియ్యం 500.. చక్కెర 300.. బాబోయ్.. ఏంటా రేట్లు..?

చైనా దురాక్రమణ కారణంగా తూర్పు లడఖ్‌లోని గల్వాన్ వ్యాలీలో 2020లో జరిగిన ఘర్షణలు ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపించాయని జైశంకర్ అన్నారు. ఈ సంఘటన నార్నల్ ఫ్రెండ్లీ రిలేషన్ షిప్ ను మళ్లీ రిస్టోర్ చేయలేదని కూడా జైశంకర్ వాంగ్ యీకి చెప్పారు. “వివాదాలు పెరగకుండా నిరోధించడం అవసరం కాబట్టి బలగాల ఉపసంహరణ ముందుకు తీసుకెళ్లాలి. చర్చలో బలగాల ఉపసంహరణ గురించి మాట్లాడాం. మన జాతీయ భావాన్ని తెలియజేయడంలో నేను నిజాయితీగా ఉన్నాను” అని జైశంకర్‌ని మీడియాకు వెల్లడించారు. జైశంకర్ చైనాలో మెడిసిన్ చదువుతున్న భారతీయ విద్యార్థుల సమస్యను లేవనెత్తారు. దీనికి స్పందిస్తూ భారతీయ విద్యార్థుల పట్ల చైనా వివక్ష రహిత (nondiscriminatory) వైఖరిని అవలంభిస్తుందని వాంగ్ యీ చెప్పుకొచ్చారు.

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చర్యలు..

అయితే ఈ వారంలో ఇస్లామాబాద్‌లో జరిగిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) విదేశాంగ మంత్రుల శిఖరాగ్ర సమావేశానికి ప్రత్యేక అతిథిగా వాంగ్ యీ హాజరయ్యారు. ఈ సమావేశంలో జమ్ము & కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి యీ కొన్ని ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలకు సంబంధించిన అంశాలను తాజాగా జైశంకర్ తన చర్చల్లో లేవనెత్తారు. "బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై ఎటువంటి టైమ్‌లైన్ లేదు. సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని క్రమబద్ధీకరించడానికి సంబంధించి ప్రత్యేక చర్చ జరిగింది,” అని కేంద్ర మంత్రి మీడియాకి వెల్లడించారు.

భారత్ కు చేరుకున్న చైనా విదేశాంగ మంత్రి.. అజిత్ ధోవల్, జైశంకర్ లతో భేటీ.. కారణం ఏంటంటే..

జైశంకర్ ను కలవడానికి ముందు, వాంగ్ యీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను కలుసుకున్నారు. వారిద్దరూ సుదీర్ఘ సమావేశంలో పాల్గొన్నారు. 2020లో గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల తర్వాత ప్రస్తుత భారత్-చైనా సంబంధాల పరిస్థితి పరస్పర ప్రయోజనాలకు అనుకూలంగా లేదని ఈ సమావేశంలో దోవల్ కూడా సూచించారు. ఇంకా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించడానికి ఇరు దేశాలు ఒకే దిశలో కలిసి పనిచేస్తాయని దోవల్ వాంగ్ యీకి హామీ ఇచ్చారు.
Published by:Veera Babu
First published:

Tags: China, International, Ladakh

తదుపరి వార్తలు