అలా చేశాడని.. విమానంలో బాయ్‌ఫ్రెండ్‌ను చితక్కొట్టిన మహిళ..

ఇష్టమొచ్చినట్టుగా బూతులు తిడుతూ అతనిపై దాడికి పాల్పడింది.గొడవ వద్దని వారించిన తోటి ప్రయాణికులపై కూడా నోరు పారేసుకుంది.చెప్పలేని రీతిలో బాయ్‌ఫ్రెండ్‌పై, ఆ ప్రయాణికులపై దుర్భాషలాడింది.

news18-telugu
Updated: July 24, 2019, 12:39 PM IST
అలా చేశాడని.. విమానంలో బాయ్‌ఫ్రెండ్‌ను చితక్కొట్టిన మహిళ..
విమానంలో బాయ్‌ఫ్రెండ్‌పై దాడి చేస్తున్న మహిళ(Image : Twitter)
  • Share this:
తాను పక్కన ఉండగానే మరో అమ్మాయి వైపు చూస్తున్నాడని ఓ మహిళ అతని బాయ్‌ఫ్రెండ్‌ని చితక్కొట్టింది. ల్యాప్‌టాప్‌తో అతని తలపై బాదింది. విమానంలో తోటి ప్రయాణికులు వారిస్తున్నా వినకుండా అతని తుక్కు రేగ్గొట్టింది. ఇష్టమొచ్చినట్టుగా బూతులు తిడుతూ అతనిపై దాడికి పాల్పడింది.గొడవ వద్దని వారించిన తోటి ప్రయాణికులపై కూడా నోరు పారేసుకుంది.చెప్పలేని రీతిలో బాయ్‌ఫ్రెండ్‌పై, ఆ ప్రయాణికులపై దుర్భాషలాడింది. నేనుండగా మరో అమ్మాయి వైపు చూస్తావా.. అని చెడామడా వాయించింది.చివరకు ఎయిర్ హెస్టెస్ సిబ్బంది ఆమెను, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను వేర్వేరు సీట్లలో కూర్చోబెట్టడంతో గొడవ సద్దుమణిగింది.అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ విమానం టేకాఫ్ అయ్యేముందు ఈ ఘటన జరిగింది. బాయ్‌ఫ్రెండ్‌పై ఆమె దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


First published: July 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు