Parker Solar Probe: శుక్రగ్రహం నుంచి రేడియో సిగ్నల్స్.. అక్కడి వాతావరణం ఎలా ఉందంటే?

ప్రతీకాత్మక చిత్రం

భూమితో పోలిస్తే శుక్రగ్రహంపై వాతావరణం చాలా భిన్నంగా ఉందని సోలార్​ ప్రోబ్​ ద్వారా తెలుసుకొని శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. వారి పరిశోధనా ఫలితాలను జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్‌లో ప్రచురించారు.

  • Share this:
సూర్యునిలో దాగి ఉన్న రహస్యాలను ప్రపంచానికి తెలియజేసేందుకు.. 2018 ఆగస్టు​ 13న​ పార్కర్ సోలార్​ ప్రోబ్​ రాకెట్‌ను నాసా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ రాకెట్​ అద్భుతమైన ఫలితాలనిస్తుంది. అయితే సూర్యున్ని విశ్లేషించడమే లక్ష్యంగా దీన్ని ప్రయోగించగా.. ఇది ఆశ్చర్యకరంగా భానుడికి దగ్గర్లో ఉన్న శుక్రుడిపై వాతావరణ పరిస్థితులను అంచనా వేసి డేటా పంపించింది. శుక్ర గ్రహానికి అతి దగ్గరగా చేరి అక్కడ సహజమైన రేడియో సిగ్నల్​లను కనుగొంది. పార్కర్​ సోలార్​ ప్రోబ్​ ద్వారా దాదాపు 30 ఏళ్ల తర్వాత శుక్రగ్రహంపై రేడియో సిగ్నల్స్​ను కనుగొన్నామని నాసా తెలిపింది. అంతేకాక, భూమి నుంచి ప్రయోగించిన ఒక రాకెట్​ ఇలా శుక్రగ్రహ దరిదాపుల్లోకి చేరడం కూడా ఇదే మొదటిసారని నాసా చెబుతోంది. దీంతో నాసా కష్టం దాదాపు ఫలించిందనే చెప్పవచ్చు.

భూమితో పోలిస్తే శుక్రగ్రహంపై వాతావరణం చాలా భిన్నంగా ఉందని సోలార్​ ప్రోబ్​ ద్వారా తెలుసుకొని శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. వారి పరిశోధనా ఫలితాలను జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్‌లో ప్రచురించారు. 2018లో పంపిన సోలార్​ ప్రోబ్​ ఏడేళ్లలో సూర్యుడి ఉపరితలాన్ని చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అప్పుడు అంచనా వేశారు. అంటే ఇది 2024లో సూర్యుడి ఉపరితలాన్ని చేరుకోనుంది. అయితే సూర్యడిపై ఉన్న వేడిని తట్టుకునేందుకు ఈ రాకెట్‌లో సరికొత్త టెక్నాలజీని ఉపయోగించారు. ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా దీన్ని తీర్చిదిద్దారు.


సోలార్​ ప్రోబ్​ ఇప్పుడు శుక్రగ్రహంపై ఉన్న వాతావరణ పరిస్థితులకు సంబంధించిన అద్భుతమైన కొన్ని ఫోటోలను భూమిపైకి చేరవేసింది. దాని ఉపరితలం నుంచి కేవలం 517 మైళ్ళు (833 కిలోమీటర్లు) దూరంలో ఈ చిత్రాలను తీయడం విశేషం. శుక్రగ్రహంపై ఉన్న వాతావరణం భూమికి ఇది ఎలా భిన్నంగా ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఈ డేటా సహాయపడుతుంది. భూగ్రహాన్ని, శుక్రగ్రహాన్ని పోల్చుకోవడానికి, భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రెండు గ్రహాలు రాతి, పరిమాణంలో సమానంగా ఉంటాయి. కానీ భూమిపై ఉన్నవిధంగా శుక్రుడిపై గురుత్వాకర్షణ క్షేత్రం ఉండదు. అంతేకాక, అక్కడి ఉపరితలం సీసాన్ని కరిగించే మండుతున్న ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది.


అంతరిక్ష నౌకను ఉపయోగించి శుక్రగ్రహంపై అధ్యయనం చేసే ప్రయత్నాలు ఇదివరకు అనేకం జరిగాయి. ఇందులో భాంగానే శుక్రగ్రహంపై వాతావరణ పరిస్థితులను అన్వేషించడానికి1978 నుంచి 1992 వరకు నాసా అనేక ప్రయోగాలు చేపట్టింది. 2005 నుంచి 2014 వరకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రెండు రాకెట్లను ప్రయోగించింది. ఈ రెండూ గ్రహం చుట్టూ కక్ష్యలో ఉన్నాయి. తాజాగా పార్కర్​ సోలార్​ ప్రోబ్​ పంపిన ఫలితాలపై నాసా గొడ్దార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్​ రీసెర్చ్​ అసోసియేట్ గ్లిన్ కాలిన్సన్ మాట్లాడారు. “శుక్ర గ్రహంపై ఉన్న వాతావరణాన్ని అంచనా వేస్తూ కొత్త డేటా రాబట్టడంపై చాలా సంతోషంగా ఉంది. ఈ డేటాతో భవిష్యత్తులో శుక్రుడిపై మరిన్ని ప్రయోగాలు చేయడానికి మార్గం సుగమం అయ్యింది" అని చెప్పారు. ప్రోబ్​ శుక్రుడి గురుత్వాకర్షణ శక్తిని వినియోగించుకుని తన కక్ష్య నిడివిని తగ్గించుకుని, వేగాన్ని మార్చుకొని 2024నాటికి సూర్యుని ఉపరితలాన్ని చేరుకుంటుంది.
Published by:Shiva Kumar Addula
First published: