Home /News /international /

కొడుక్కి రూ. 22 లక్షలు కట్టాలని తల్లిదండ్రులను ఆదేశించిన కోర్టు.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

కొడుక్కి రూ. 22 లక్షలు కట్టాలని తల్లిదండ్రులను ఆదేశించిన కోర్టు.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తల్లిదండ్రులు, కొడుక్కి మధ్య నెలకొన్న ఓ వివాదంలో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తల్లిదండ్రులు కొడుక్కి రూ. 22 లక్షల రూపాలయు చెల్లించాలని ఆదేశించింది.

    తల్లిదండ్రులు, కొడుక్కి మధ్య నెలకొన్న ఓ వివాదంలో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తల్లిదండ్రులు కొడుక్కి రూ. 22 లక్షల రూపాలయు చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకుంది. ఇంతకీ కోర్టు కొడుక్కి డబ్బులు కట్టాలని ఆదేశించింది, ఇంతకీ అతడి తల్లిదండ్రులు ఏం చేశారో తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే. వివరాలు.. ఇండియానాకు(Indiana) చెందిన వేర్కింగ్(David Werking) అనే వ్యక్తి పోర్న్ వీడియోలకు బానిసగా మారాడు. వాటిని చూడటమే పనిగా పెట్టుకున్నాడు. అంతేకాకుండా డిఫరెంట్ పోర్న్ వీడియోలు సేకరించేందుకు భారీగా ఖర్చు చేశాడు. అనేక వెబ్‌సైట్లలోని కొత్త కొత్త వీడియోలను సేకరించేవాడు. పోర్న్ వీడియలో కోసం ఏకంగా 29వేల డాలర్లు(దాదాపు 21 లక్షల రూపాయలు) ఖర్చు చేశాడు. అయితే వాటిని తన తల్లిదండ్రులు నాశనం చేశారని డేవిడ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

    ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్డ్ పాల్ మలోని(judge Paul Maloney) కొద్ది నెలల క్రితం కేసు దాఖలు చేసిన డేవిడ్ వేర్కింగ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారు. డేవిడ్ తన ఆస్తిని నష్టపోయాడనడంలో ఎటువంటి సందేహాం లేదన్నారు. అతడు నష్టపోయిన మొత్తాన్ని పరిహారంగా పొందవచ్చని కూడా పేర్కొన్నారు. అయితే నాశనం అయిన అశ్లీల వీడియోలకు సంబంధించిన మొత్తం ఆర్థిక విలువపై పత్రాలు దాఖలు చేయాలని ఇరువర్గాలకు సూచించారు. అయితే తాజాగా ఇందుకు సంబంధించి జడ్జ్ పాల్ మలోని.. కీలక ఆదేశాలు జారీచేశారు.

    Birth to own Granddaughter: మనవరాలికి జన్మనిచ్చిన అమ్మమ్మ.. అసలేం జరిగిందంటే..



    డేవిడ్ సేకరించిన పోర్నో వీడియోల కలెక్షన్‌ను నాశనం చేసినందుకు గాను 30,441 డాలర్లు(రూ.22.37లక్షలు) చెల్లించాల్సిందిగా అతని తల్లిదండ్రులను జడ్జ్ పాల్ మలోని ఆదేశించారు. ప్రస్తుతం ఈ తీర్పు హాట్ టాపిక్‌గా మారింది.

    Afghanistan: కాబూల్‌లో మళ్లీ ఉగ్రదాడి... అమెరికా హెచ్చరిక


    ఇక, డేవిడ్ పోర్న్ వీడియోలకు బానిసగా మారడంతో.. అతని భార్య పద్దతి మార్చుకోవాలని చెప్పిచూసింది. ఈ క్రమంలోనే వారి మధ్య గొడవలు జరిగాయి. డేవిడ్ మారకపోవడంతో భార్య అతడిని వదిలి వెళ్లిపోయింది. డేవిడ్‌కు విడాకులు ఇచ్చి.. మరో పెళ్లి చేసుకుంది. దీంతో ఒంటరిగా ఉంటున్న డేవిడ్ తల్లిదండ్రులు నివాసం ఉండే మిచిగాన్‌కు వచ్చాడు. అయితే కొడుకు పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు అతడిని ఎలాగైనా పోర్న్ వీడియోల(Porn Videos) నుంచి దూరంగా తీసుకురావాలని అనుకున్నారు. డేవిడ్ సేకరించిన మొత్తం పోర్న్ వీడియోలను అతను ఇంట్లో లేని సమయంలో డిలీట్ చేశారు. అయితే ఆ విషయం తెలుసుకున్న డేవిడ్.. తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన తల్లిదండ్రులే అశ్లీల వీడియోలకు చెందిన సీడీలు పగుల కొట్టారని తెలుసుకున్నాడు. అనంతరం ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులపై కోర్టులో దావా (Lawsuit against parents)వేశాడు. తాజాగా ఈ కేసుకు సంబంధించి తల్లిదండ్రులు కొడుక్కి తప్పనిసరిగా రూ. 22.37 లక్షల చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Porn Movies, USA

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు