హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

హిందువులు ఆవు మూత్రం తాగేవాళ్లు.. పాక్ మంత్రి వ్యాఖ్యలపై దుమారం.. దెబ్బకు రాజీనామా

హిందువులు ఆవు మూత్రం తాగేవాళ్లు.. పాక్ మంత్రి వ్యాఖ్యలపై దుమారం.. దెబ్బకు రాజీనామా

పాకిస్తాన్ మంత్రి చోహాన్

పాకిస్తాన్ మంత్రి చోహాన్

భారత్, పాక్‌ల మధ్య వేడి కాస్త చల్లారుతున్న పరిస్థితుల్లో.. పాకిస్తాన్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఉంటున్నాయి. తాజాగా పాకిస్తాన్‌‌లోని పంజాబ్ మంత్రి ఫయ్యాజుల్ హసన్ చోహన్.. హిందువులను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయణ్ని నెటిజన్లు ట్రోల్ చేస్తూ.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

  పుల్వామా దాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌లోని జైష్ ఈ మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన జరిపిన మెరుపు దాడులు చేయడంతో... ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాల సరిహద్దుల్లో భయానక వాతావరణం ఏర్పడింది. వేడి కాస్త చల్లారుతున్న పరిస్థితుల్లో.. పాకిస్తాన్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఉంటున్నాయి. తాజాగా పాకిస్తాన్‌‌లోని పంజాబ్ మంత్రి ఫయ్యాజుల్ హసన్ చోహన్.. హిందువులను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయణ్ని నెటిజన్లు ట్రోల్ చేస్తూ.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తానీలు సైతం ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ కామెంట్లు పెడుతున్నారు. విమర్శలు వెల్లువెత్తడంతో.. ఆయన తన పదవికి రాజీనామా చేశారు.


  పంజాబ్ ఇన్‌ఫర్మేషన్ అండ్ కల్చర్ మినిస్టర్‌గా ఉన్న చోహాన్.. తాజాగా మీడియాతో మాట్లాడుతూ హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ హిందువులు ఆవు మూత్రం తాగేవాళ్లు. మేము మహ్మదీయులం. మాకొక జెండా ఉంది. అంద మౌలా అలియా ధైర్యానికి చిహ్నం. మీకు అలాంటి జెండా లేదు. అది మీ చేతుల్లో లేదు. ’’ అని వ్యాఖ్యానించారు.


  భారత్‌లోని హిందువులపై చోహాన్ చేసిన వ్యాఖ్యలను.. పాకిస్తానీయులు సైతం తప్పుబడుతున్నారు. సోషల్ మీడియాలో ఆయనను ట్రోల్ చేస్తూ.. తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీలో సభ్యుడిగా ఉన్న చోహాన్‌ను వెంటనే మంత్రిపదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులే కాదు, ముస్లింలు సైతం చోహాన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆర్థిక మంత్రి అసద్ ఉమర్ కూడా చోహాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ జెండా అంటే కేవలం ఆకుపచ్చ రంగుమాత్రమే కాదని, తెలుపు రంగు లేకుండా పాక్ జెండా సంపూర్ణం కాబోదని గుర్తు చేశారు.


  ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తడంతో.. పాకిస్తానీ మంత్రి చోహాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
  పాకిస్తాన్ మంత్రి చోహాన్ వ్యాఖ్యల్ని ఖండించిన ఆర్థికమంత్రి అసద్ ఉమర్..


   


  First published:

  Tags: India VS Pakistan, Pakistan, Pulwama Terror Attack, Surgical Strike 2

  ఉత్తమ కథలు