Home /News /international /

PAKISTANS PM SHAHBAZ SHARIF TOLD HIMSELF MAJNU IN COURT PVN

Shahbaz Sharif : నేనొక పిచ్చోడిని..పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు

షెహబాజ్ షరీఫ్(ప్రతీకాత్మక చిత్రం)

షెహబాజ్ షరీఫ్(ప్రతీకాత్మక చిత్రం)

Pakistans PM Shahbaz Sharif : మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ శనివారం ఈ కేసు విచారణ నిమిత్తం లాహోర్ స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా ప్రధాని షరీఫ్ కోర్టులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
Pakistans PM Shahbaz Sharif told himself Majnu : మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ శనివారం ఈ కేసు విచారణ నిమిత్తం లాహోర్ స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా ప్రధాని షరీఫ్ కోర్టులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానో తెలివితక్కువ వాడినని, అందుకే పంజాబ్‌ సీఎంగా ఉన్నప్పుడు జీతం కూడా తీసుకోలేదంటూ పీఎం వ్యాఖ్యలు చేశారు. పన్నెండున్నరేళ్లుగా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, కానీ ఈ కేసులో తనపై మనీలాండరింగ్ ఆరోపణలు మోపారని ప్రధాని షాబాజ్ షరీఫ్ వాపోయారు.

అవినీతి, అక్రమ సంపాదన ఆరోపణల నేపథ్యంలో షరీఫ్‌, ఆయన కుమారులు హంజా, సులేమాన్‌లపై 2020 నవంబరులో ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(FIA)మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేసింది. హంజా షరీఫ్ ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుండగా, సులేమాన్ బ్రిటన్ లో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి శనివారం ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. షెహబాజ్‌ కుటుంబానికి చెందిన 28 బినామీ ఖాతాలను తాము గుర్తించామని ఎఫ్‌ఐఏ కోర్టుకు తెలిపింది. 2008 నుంచి 2018 మధ్య ఈ బినామీ ఖాతాల ద్వారా ఆయన 14 బిలియన్ల పాకిస్తాన్ రూపాయలు అక్రమ సంపాదన ఆర్జించినట్లు ఆరోపించింది.

ALSO READ Shocking:రంపంతో కోసి భార్యా,పిల్లలను దారుణంగా హత్య చేశాడు..ఆపై..

ఎఫ్‌ఐఏ ఆరోపణలను తోసిపుచ్చిన ప్రధాని.. కోర్టులో న్యాయమూర్తి అనుమతితో తన వాదన వినిపించారు. "భగవంతుడు నన్ను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. నేనొక 'మజ్నూ'ని (పిచ్చివాడ్ని). జీతం, ఇతర ప్రయోజనాలను పొందకపోవడమే కాదు, న్యాయపరమైన హక్కులను కూడా ఉపయోగించుకోలేకపోయాను" అని వ్యాఖ్యానించారు. తాను పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కార్యదర్శి చక్కెర ఎగుమతులకు సంబంధించి ఓ నోట్ పంపాడని, అయితే తాను ఎగుమతి పరిమితిని నిర్ణయిస్తూ ఆ నోట్ ను తిరస్కరించానని షరీఫ్ వెల్లడించారు. దాని వల్ల తన కుటుంబం 2 బిలియన్ల పాకిస్తానీ రూపీలు నష్టపోయిందని.. తన కుమారుడు ఇథనాల్‌ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇథనాల్‌పై సుంకం విధించానని.. ఆ నిర్ణయంతో తన కుటుంబం 800 మిలియన్ల పాకిస్తానీ రూపీలను కోల్పోవాల్సి వచ్చిందని.. జరిగింది అదేనని కానీ రాజకీయ కుట్రలో భాగంగానే తనపై మనీలాండరింగ్ అభియోగాలు మోపారని ఆరోపించారు.

కాగా,1997లో షెహబాజ్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌కు తొలిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆయన సోదరుడు నవాజ్‌ షరీఫ్‌ పాక్‌ ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత 1999లో నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత.. షెహబాజ్‌ కుటుంబం దేశం విడిచి వెళ్లిపోయింది. ఎనిమిది సంవత్సరాలు సౌదీ అరేబియాలో అజ్ఞాతంలో ఉండి 2007లో తిరిగి స్వదేశానికి వచ్చింది. ఆ తర్వాత 2008లో షెహబాజ్‌ మళ్లీ పంజాబ్‌ సీఎంగా ఎన్నికయ్యారు. 2013లోనూ మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.ఇ టీవల ఇమ్రాన్‌ ఖాన్‌పై అవిశ్వాసంతో ఆ ప్రభుత్వం కూలిపోవడంతో షెహబాజ్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు. షెహబాజ్‌ పీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇమ్రాన్‌ఖాన్‌ ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Pakistan, Shehbaz Sharif

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు