హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Breaking: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మృతి

Breaking: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మృతి

File

File

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన UAEలోని అమెరికన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. దేశ విభజనకు ముందు 1943 ఆగస్టు 11న ముషారఫ్ ఢిల్లీలో జన్మించారు. ముషారఫ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1999లో నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. సైన్యాధ్యక్షుడిగా పాక్ పాలనా పగ్గాలు చేపట్టారు. రెండేళ్ల తర్వాత ఎన్నికల్లో గెలిచి పాక్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 1999లో కార్గిల్‌ యుద్ధానికి పర్వేజ్ ముషారఫ్‌ ప్రధాన కారకుడు. 2001 నుంచి 2008 వరకు పాకిస్థాన్‌ అధ్యక్షుడిగా ముషారఫ్ పని చేశారు. 2008లో అభిశంసనను తప్పించుకొనేందుకు ముషారఫ్ తన పదవికి రాజీనామా చేశారు. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో ముషారఫ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక 2016లో తన కుటుంబంతో కలిసి దుబాయ్‌ వెళ్లిపోయారు. అప్పటినుంచే అక్కడే నివాసముంటున్న ఆయన అనారోగ్య సమస్యతో మృతి చెందారు.

నియంత పాలన... మరణశిక్ష..!

రాజ్యాంగాన్ని వక్రీకరించి తీవ్ర స్థాయి దేశ ద్రోహానికి పాల్పడిన నేరానికిగాను పర్వేజ్ ముషారఫ్‌కు పాక్‌ ప్రత్యేక కోర్టు 2019 డిసెంబర్‌ 17న మరణశిక్ష విధించింది. పాక్‌ చరిత్రలో ఒక సైనిక పాలకుడికి మరణశిక్ష వేయడం అదే మొదటిసారి. అయితే అప్పటికే దుబాయ్‌లో ఉంటున్న ముషారఫ్‌కు ఈ శిక్ష అమలు కాలేదు. పాక్‌ చరిత్రలో అత్యంత శక్తివంతమైన వ్యవస్థగా సుదీర్ఘకాలం సైన్యమే కొనసాగింది. ఓ మాజీ సైనికాధినేత, నియంతకు ఉరిశిక్ష పడడం అన్నది అప్పట్లో అత్యంత కీలక పరిణామం

ప్రభుత్వాన్ని కుప్పకూల్చి.. అధికారమెక్కి..!

1999లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి సైనికాధినేతగా ఉన్న ముషారఫ్ అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. 2001 నుంచి 2008 వరకు దేశాధ్యక్షుడిగా కొనసాగారు. 2007లో రాజ్యాంగాన్ని నిలిపివేసి, రాజ్యాంగ విరుద్ధంగా ఎమర్జన్సీని విధించారు. తనకు ఆరోగ్యం బాగాలేదన్న సాకుతో 2016లో ముషారఫ్ దుబాయ్ వెళ్లిపోయారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన పాక్‌కు తిరిగి వెళ్లలేదు. భద్రత, ఆరోగ్య అంశాలను ఆయన ఎప్పటికప్పుడు కారణాలుగా చెబుతూ వచ్చారు. అయితే ఆయన చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాట నిజమే! గతేడాది జూన్‌లో కూడా ఆయన పరిస్థితి విషమించింది. అప్పుడే ముషారఫ్‌ చనిపోయాడన్న ప్రచారం జరిగింది. అయితే పాక్‌ ఆ వార్తలను కొట్టిపారేసింది. ఇప్పుడు ముషారఫ్‌ కుటుంబసభ్యులే ఆయన మరణ విషయాన్ని ధృవీకరిచారు.

First published:

ఉత్తమ కథలు