Pakistan: పైస‌లు లేవు.. ప‌న్నులు క‌ట్టండి.. పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

రోజు రోజుకు పాకిస్థాన్ (Pakistan) ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జారుతోంది. స్వ‌యంగా ఆ దేశ ప్ర‌ధానే ఈ విష‌యం వెల్ల‌డించాడు. ఇస్లామాబాద్లోని ఫెడరల్ బ్యూ రో ఆఫ్ రెవెన్యూ(Revenue) లో ట్రాక్ అం డ్ ట్రేస్ సిస్టమ్ ప్రారంభోత్స వ కార్య క్రమం లో పాల్గొన్న ఆయన.. దేశ ఆర్థిక వ్య వస్థ గురిం చి ప్రస్తావించారు.

 • Share this:
  రోజు రోజుకు పాకిస్థాన్ (Pakistan) ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జారుతోంది. స్వ‌యంగా ఆ దేశ ప్ర‌ధానే ఈ విష‌యం వెల్ల‌డించాడు. ఇస్లామాబాద్లోని ఫెడరల్ బ్యూ రో ఆఫ్ రెవెన్యూ లో ట్రాక్ అం డ్ ట్రేస్ సిస్టమ్ ప్రారంభోత్స వ కార్య క్రమం లో పాల్గొన్న ఆయన.. దేశ ఆర్థిక వ్య వస్థ గురిం చి ప్రస్తావించారు. పాకిస్థాన్‌లో ప్ర‌స్తుతం ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే.. దేశాన్ని ముందుకు నడిపించడానికి కావాల్సిన ధనం లేద‌ని పేర్కొన్నారు. దీంతో అప్పులు చేయాల్సి వస్తోంద‌ని ఇమ్రాన్‌ఖాన్ (Imaran Khan) వెల్ల‌డించారు. ఈ దుస్థితికి గ‌త ప్ర‌భుత్వాలే కార‌ణం అన్నారు. వారు విప‌రీతంగా అప్పులు చేశార‌ని అందువ‌ల్లే ఇటువంటి ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

  ప‌న్నులు క‌ట్టే వారే క‌రువు..
  ఈ సంద‌ర్భంగా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ నాలుగు నెలల్లో ప్రభుత్వం 3.8బిలియన్ డాలర్లు అప్పు చేసిందని తెలిపారు. పాకిస్థాన్ ఈ అప్పుల నుంచి బ‌య‌ట ప‌డాలంటే అంద‌రూ ప‌న్నులు క‌ట్టాల‌ని కోరారు.

  Internship: ఎక‌న‌మిక్స్‌, ఫైనాన్స్‌ రంగం స్టూడెట్స్‌కి గుడ్ చాయిస్‌.. ఆర్‌బీఐలో ఇంట‌ర్న్‌షిప్ ప్రొగ్రాం

  పాకిస్థాన్‌లో మొత్తం 22 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందుక‌లో ప‌న్ను క‌ట్టే వారు కేవ‌లం 30 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే వారు కూడా స‌రిగా క‌ట్ట‌ట్లేద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. దాదాపు 15 ల‌క్ష‌ల మంది త‌క్ష‌ణ‌మే ప‌న్నులు క‌ట్టాల‌ని నోటీసిలు పంపింది.

  ఇమ్రాన్ ​ఖాన్​ను ‘బడా భాయ్​’ అంటూ సిద్ధూ వ్యాఖ్యలు..


  పంజాబ్​ రాజకీయాలు (Punjab politics) ఆసక్తిగా మారాయి. మరికొద్దిరోజుల్లో ఎన్నికలు ఉండటంతో అధికార కాంగ్రెస్​, ప్రతిపక్ష బీజేపీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కొద్దిరోజులుగా పంజాబ్​ కాంగ్రెస్​లో అమరీందర్​ సింగ్ (Amarinder singh)​ రాజీనామా, కొత్త ముఖ్యమంత్రి చరణ్​ సింగ్ (Charn jeeth singh)​ బాధ్యతులు, నవజ్యోత్​సింగ్ సిద్దూ (Navjot Singh Sidhu) వ్యవహారం తారాస్థాయిలో రచ్చరచ్చగా మారింది. అయితే కాంగ్రెస్​ అధిష్టానం (congress high command) అన్ని వ్యవహారాలు చక్కబెట్టింది.

  దీంతో ముఖ్యమంత్రిగా చరణ్​ సింగ్​, ఎన్నికల ప్రచార బాధ్యతలు సిద్దూ నడిపేట్లు వ్యవహారం సాగుతోంది. అయితే అధికారం నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్​ నడం బిగించింది. దీనిలో భాగంగా వ్యవసాయ చట్టాలకు  (Agriculture laws) వ్యతిరేకంగా ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొని అరెస్టయిని 80 మందికి పైగా రైతులకు సీఎం చరణ్​ జిత్​ రెండు లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని బీజేపీ (BJP) ఖండించింది కూడా. అయితే దీనితో పంజాబ్​లో కాంగ్రెస్​కు మైలేజీ పెరిగిందనేది వాస్తవం. అయితే ఇదే సమయంలో పంజాబ్​లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా నవ్యజోత్ సింగ్ (Navjot Singh Sidhu)​ మాట్లాడిని ఓ వీడియో (Video)ని వదిలింది. దీంతో పంజాబ్​లో రచ్చ మొదలైంది.
  Published by:Sharath Chandra
  First published: