Home /News /international /

PAKISTANI WOMAN MLA SANIA AASHIQUI IS RUMORED TO BE IN A VIRAL PORNOGRAPHIC VIDEO ON SOCIAL MEDIA PRV

MLA Video: సోషల్​ మీడియాలో లీకైన అశ్లీల వీడియో.. మహిళా ఎమ్మెల్యేదంటూ నెటిజన్ల విమర్శలు.. ఎవరిదంటే

సానియా (పక్కన వైరల్​ అయిన వీడియోలోని చిత్రం)

సానియా (పక్కన వైరల్​ అయిన వీడియోలోని చిత్రం)

సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు.... ప్రతీ ఒక్కరు సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. తాజాగా అశ్లీల వీడియో (Pornographic video) ఒకటి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కింది.

    సైబర్ క్రైమ్ (Cybercrime) నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు.... ప్రతీ ఒక్కరు సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. తాజాగా అశ్లీల వీడియో (Pornographic video) ఒకటి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కింది. దీంతో ఆ వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. పాకిస్తాన్‌ (Pakistan)లో ఓ మహిళా ఎమ్మెల్యే అంటూ అశ్లీల వీడియో సోషల్ మీడియాలో లీకవడం తీవ్ర కలకలం రేపుతోంది. గత కొద్దిరోజులుగా సోషల్ ప్లాట్‌ఫామ్స్‌ (social platforms)లో ఆ వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఉన్నది పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ ఎమ్మెల్యే సానియా ఆషిక్‌‌గా (Sania Ashiq) ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె పంజాబ్ ప్రావిన్స్‌లోని తక్షిలా అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వీడియోపై ఎమ్మెల్యే సానియా ఆషిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    వైరల్ చేస్తున్నారని..

    అక్టోబర్‌ 2021లో ఆ వీడియో (Viral video) ఎమ్మెల్యే సానియా ఆషిక్ దృష్టికి వచ్చిందని... అదే నెల 26న ఆమె ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (Federal investigation agency)కి ఫిర్యాదు చేశారని పాకిస్తాన్ మీడియా (Pakistan media) వెల్లడించింది. సోషల్ మీడియాలో(Social Media) తన పేరిట పోర్నోగ్రఫీ వీడియో (Pornography video)ను వైరల్ చేస్తున్నారని ఎమ్మెల్యే సానియా తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపింది. ఆ వీడియోలో ఉన్నది ఎమ్మెల్యే సానియానే అని చాలామంది నెటిజన్లు (netizens) కామెంట్స్ చేస్తుండగా... ఆ ప్రచారాన్ని ఆమె ఖండించారు. ఆ వీడియో తనది కాదని స్పష్టం చేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    సానియానా.. మరొకరా..?

    సానియా ఫిర్యాదు (complaint)పై దాదాపు 3 వారాల దర్యాప్తు అనంతరం లాహోర్‌ (Lahore)కి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతని వివరాలేవీ పోలీసులు (police) బయటకు వెల్లడించలేదు. అలాగే ఆ వీడియోలో ఉన్నది సానియానా, మరొకరా అన్న విషయం కూడా పోలీసులు ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు (Trial) కొనసాగుతోంది. పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం... పాక్ (Pakistan) మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (Nawaz sharif) కుమార్తె మరియం నవాజ్‌కు సానియా సన్నిహితురాలు. ప్రస్తుత ఇమ్రాన్ (Imran Khan) ప్రభుత్వం అవలంభిస్తున్న పలు విధానాలకు వ్యతిరేకంగా ఆమె పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బెదిరింపు కాల్స్ (calls) కూడా సానియా ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ విషయం పాకిస్తాన్​లో ఇపుడు హాట్​ టాపిక్​గా మారింది. కాగా, ప్రతిపక్షాలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాయి.

    Read this also: వ్యవసాయ చట్టాల రద్దుపై కంగనా రనౌత్​ వివాదాస్పద వ్యాఖ్యలు.. అలా అయితే ఇది జీహాదీ దేశమంటూ..
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Pakistan, Pornography case, Viral Video, Women

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు