ఐసీసీ టీ20 ప్రపంచకప్ (T20 world cup) సిరీస్లో భాగంగా యూఏఈ వేదికగా ఆదివారం నాడు భారత్-పాకిస్తాన్ (INDVSPak) మధ్య మ్యాచ్ (match) జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ పరాజయం (lost) మూటగట్టుకుంది. అయిత గెలవక గెలవక ఒక్క మ్యాచ్ గెలిచి రెచ్చిపోతున్నారు పాకిస్తాన్ మంత్రులు (Pakistan ministers). నోటికి దూల ఎక్కువై కారు కూతలు కూస్తున్నారు. సామాన్యులంటే ఏమో అనుకోవచ్చు.. కానీ, మంత్రులే పిచ్చి కూతలు కూస్తున్నారు. తన స్థాయిని మరిచి కామెంట్లు చేశాడు. నిన్నటి మ్యాచ్లో పాక్ గెలుపు ఇస్లాం విజయం (Islam Won) అని, భారత ముస్లిం (Muslims)లు తమవైపే ఉన్నారని అంటూ పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ (Sheikh Rashid Ahmed) కామెంట్స్ చేశాడు. దానికి సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో వదిలాడు. అది కూడా పాకిస్తాన్ పీఎంఓని ట్యాగ్ చేస్తూ పోస్టు చేశాడు.
ముస్లింల మద్దతు ఉంది..
మంత్రి షేక్ రషీద్ అహ్మద్ (Sheikh Rashid Ahmed) ఇంకా ఏమన్నాడంటే.. ‘‘ ఇండియాపై విజయం సాధించిన పాక్కు అభినందనలు. పట్టుదలతో ప్రత్యర్థిని ఓడించారు. పాక్ సత్తా ఏంటో ముస్లిం (muslim) ప్రపంచం ముందు ప్రదర్శించారు. మనకు ఇదే టీ20 ప్రపంచకప్ ఫైనల్ (Final). అందుకే దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకొనేందుకు నగరాల్లో బారికేడ్లను తొలగించాలని ఆదేశించాను. భారత్ సహా ప్రపంచంలోని ముస్లింలందరి మద్దతు పాక్కు ఉంది. ఇది ఇస్లాం విజయం.’’ అని అన్నాడు.
پاکستان انڈیا میچ ٹکرا:
پاکستانی کرکٹ ٹیم اور عوام کو مبارکباد پیش کرتا ہوں.https://t.co/Tc0IG0n2DJ@GovtofPakistan @ImranKhanPTI #PakvsIndia pic.twitter.com/e9RkffrK2O
— Sheikh Rashid Ahmed (@ShkhRasheed) October 24, 2021
ప్రసార శాఖ మంత్రి
పాకిస్థాన్ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవద్ చౌదరి (pawad Chowdary) అయితే.. భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దిగజారడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కారణం అంటూ రెండు రోజుల ముందు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) భారతదేశ రాజధాని ఢిల్లీలో బహిరంగ సభ పెడితే.. భారత ప్రధాని మోదీ (narendra modi) సభ కంటే కూడా ఎక్కువ జనాభా తమ ప్రధాని సభకు వస్తారని తెలిపారు. ఎందుకంటే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారత దేశంలో అత్యధిక జనాదరణ ఉందని మంత్రి ఫవద్ చౌదరి అన్నారు. ఫవద్ చేసిన వ్యాఖ్యలు కొద్ది క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. అయితే పాక్లో ఒక్క టీ ధర రూ. 40.. ఇక స్వయంగా పాక్ మంత్రి (pakistan minister).. పాకిస్థాన్ లోని భావితరాలకు కాపాడుకోవాలంటే.. పాక్ ప్రజలు త్యాగాలు చేయాలనీ.. రోజుకు ఒక్కపూట మాత్రమే ఆహారం తినాలని చేసిన వ్యాఖ్యలు అన్నీ గుర్తు చేస్తూ నెటిజన్లు ఫవద్ పై విరుచుకుపడుతున్నారు.
Imran Khan is very popular in India. If he holds a rally in Delhi today, it will be a bigger than PM Modi's: Fawad Chaudhry.
First results of govt's bhang policy. pic.twitter.com/WPsCvpdGbQ
— Naila Inayat (@nailainayat) October 23, 2021
టపాసులు కాల్చడంపై సీరియస్..
ఐసీసీ టీ20 ప్రపంచకప్లో పాక్ చేతిలో భారత ఓటమి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పాక్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ సేన ఓటమి పాలవడంతో యావత్ దేశం నిరాశ (sad)లో ఉంటే.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు బాణాసంచా (crackers) కాల్చి సంబరాలు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా.. శ్రీనగర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో కొందరు పాక్ విజయానికి సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి వేడుక జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇదేం విధానం అంటూ మండిపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ICC, ICC Women T 20 World Cup 2020, India pakistan, India VS Pakistan