హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Pakistani Leaders Assets : పాపం ఇమ్రాన్ ఖాన్ ఆస్తి 4 మేకలేనట! -నేతల కంటే భార్యలే రిచ్!!

Pakistani Leaders Assets : పాపం ఇమ్రాన్ ఖాన్ ఆస్తి 4 మేకలేనట! -నేతల కంటే భార్యలే రిచ్!!

పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్, భార్య బుష్రా బీబీ (పాత ఫొటోలు)

పాక్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్, భార్య బుష్రా బీబీ (పాత ఫొటోలు)

చాలా మంది రాజకీయ నేతలు అఫిడవిట్లలో తాము పేదోళ్లమని, నామమాత్రపు ఆస్తిపరులమేనని, కనీసం కార్లు కూడా లేవని చెప్పుకోవడం మనకు కొత్తకాదు. ఇలాంటి రాజకీయ వైచిత్రికి పాకిస్తాన్ కూడా అతీతంకాదు. పాకిస్తానీ నేతల ఆస్తుల రిపోర్టులోనూ అలాంటి విచిత్రాలే ఉన్నాయి.

ఇంకా చదవండి ...

సంపన్న జీవితం అనుభవిస్తున్నప్పటికీ చాలా మంది రాజకీయ నేతలు అఫిడవిట్లలో తాము పేదోళ్లమని, నామమాత్రపు ఆస్తిపరులమేనని, కనీసం కార్లు కూడా లేవని చెప్పుకోవడం మనకు కొత్తకాదు. ఇలాంటి రాజకీయ వైచిత్రికి పాకిస్తాన్ కూడా అతీతంకాదు. పాకిస్తానీ నేతల ఆస్తులకు సంబందించి ఇటీవల వెలుగులోకి వచ్చిన (Pakistani Leaders Assets) రిపోర్టులోనూ అలాంటి విచిత్రాలే ఉన్నాయి.

ప్రపంచంలోనే సంపన్న క్రికెటర్లలో ఒకరిగా పేరుపొందిన మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తనకు పెట్టుబడులేవీ లేవని, ఉన్నవి నాలుగు మేకలేనని చెప్పుకోగా, ఆయన ప్రస్తుత భార్య మాత్రం ధనవంతురాలిగా నిలిచారు. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ (Pakistan PM Shehbaz Sharif asserts) సైతం తన భార్య, మాజీ భార్యలకంటే పేదవాణ్నని పేర్కొన్నారు. అట్లుంటది రాజకీయ నేతలతో అనిపించే ఆస్తుల వివరాలివే..

అక్క బీఎస్ఎఫ్ జవాన్.. అన్న కోసం ఆర్మీలో చేరాలనుకున్నాడు.. కానీ : రాకేశ్ విషాదాంతం


పాకిస్తాన్ లో ప్రస్తుత, మాజీ పాలకుల కంటే వారి భార్యలు, మాజీ భార్యలే ధనవంతులుగా తేలారు. నేతల సతీమణుల ఖాతాల్లో నగదుతో పాటు వారి పేరిటే ఆస్తులూ ఎక్కువగా ఉన్నట్టు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడ్‌విట్ వివరాల ద్వారా వెల్లడయ్యింది. తన పేరుతో కనీసం ఒక్కపైసా పెట్టుబడి లేదన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. రూ.2లక్షలు విలువ చేసే నాలుగు మేకలు ఉన్నాయని చెప్పుకున్నారు.

CM KCR | Agnipath Row : Secunderabad ఘటనపై సీఎం కేసీఆర్ షాక్ -రాకేశ్ ఫ్యామిలీకి పరిహారం


నాలుగు మేకలతోపాటు వారసత్వంగా లభించిన మరో ఆరు స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలో 60 మిలియన్ల పాక్ కరెన్సీ, విదేశీ నగదు ఖాతాల్లో 329,196 అమెరికన్ డాలర్లు, 518 బ్రిటన్ పౌండ్లు ఉన్నట్లు ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. అయితే, ఈ మాజీ స్టార్ క్రికెటర్ పేరు మీద ఒక్కటంటే ఒక్క వాహనం కూడా లేదట. విదేశాల్లోనూ ఆస్తులేవీ లేవట. కానీ, ఇమ్రాన్ ప్రస్తుత భార్య బుష్రా బీబీ ఖాతాలో మాత్రం 142.11 మిలియన్ల పాక్ కరెన్సీ, నాలుగు స్థిరాస్తులు ఉన్నట్లు చెప్పుకున్నారు. అంటే పాపం ఇమ్రాన్.. తన మూడో భార్య కంటే పేదవారన్నమాట!

Hyderabad : బాలికపై పదే పదే అత్యాచారం.. గర్భం దాల్చడంతో.. బెదిరించి అబార్షన్‌


మాజీ ప్రధాని ఇమ్రాన్ ముచ్చట అట్లుంటే, ప్రస్తుత ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ దగ్గర కూడా ఆయన మొదటి భార్య బేగం నుస్రత్ కంటే తక్కువ డబ్బులున్నాయట. పీఎం షరీఫ్ మొదటి భార్య ఖాతాలో 230.29 మిలియన్ల నగదు, తొమ్మిది వ్యవసాయ సంబంధిత ఆస్తులున్నాయి. లాహోర్, హజారాలో రెండు ఇళ్లు, పలు సంస్థల్లో పెట్టుబడులూ ఆమె పేరుతో ఉన్నాయి. కానీ నుస్రత్ కు సొంత వాహనం లేదు. మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు ఆమెపై గతేడాది అభియోగాలు నమోదయ్యాయి.

Sai Pallavi | Vijayashanthi : సాయి పల్లవిపై విజయశాంతి అనూహ్య స్పందన.. అలాంటి సమాజంలో ఉన్నాం..


ఇక, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రెండో భార్య తెహ్మీనా దుర్రానీ ఖాతాలో చాలా కాలం నుంచి 5.76 మిలియన్ల పీకేఆర్‌లు నిల్వ ఉన్నాయి. ప్రధాని షెహబాజ్‌ బ్యాంకు ఖాతాలో 104.21 మిలియన్ల పాక్‌ కరెన్సీ ఉండగా.. రూ.141.78 మిలియన్ల అప్పులున్నాయి. లాహోర్, షైఖ్‌పుర్‌లో వ్యవసాయ భూములు, ముర్రే, లాహోర్‌లో ఒక్కో ఇల్లు, లండన్‌లో రూ.137.43 మిలియన్ల ఖరీదు భవంతి ఉన్నట్లు ప్రకటించిన ప్రధాని.. తన పేరుతో రెండు వాహనాలు ఉన్నట్టు చెప్పి నిజాయితీ చాటుకున్నారు.

పాకిస్తాన్ రాజకీయాల్లో మరో కీలక నేత పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీ పుట్టుకతోనే బిలీనియర్‌. ఆయన తన సంపద 1.6 బిలియన్లగా అఫిడవిట్ లో పేర్కొన్నారు. యూఏఈలోనూ భారీగా ఆస్తులున్నాయని, దుబాయ్‌లోని 25 ఆస్తుల విలువ 1.44 బిలియన్లని, 19 వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, బ్యాంకులో రూ.122.14 మిలియన్ల సొమ్ము ఉందని దివంగత ప్రధాని బెనజీర్ భుట్టో తనయుడైన బిలావన్ చెప్పుకున్నారు.

First published:

Tags: Assets, Imran khan, Pakistan

ఉత్తమ కథలు