పాకిస్తాన్ లో దారుణం చోటు చేసుకుంది. ఆ దేశ సైన్యాన్ని విమర్శించినందుకు ఓ మహిళా న్యాయవాదిని కిడ్నాప్ చేసిన కేసు ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆమెను సుమారు నాలుగు రోజులు హింసించిన తరువాత, అపస్మారక స్థితిలో ఒక పొలంలోకి ఆమెను విసిరేసారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళితే ఇష్రత్ నస్రీన్ అనే న్యాయవాది ఇటీవల పాకిస్తాన్ సైన్యాన్ని విమర్శించారు. దీంతో ఆమెను దేశద్రోహిగా అభివర్ణించి ముద్ర వేశారు. అంతేకాదు ఆమె సైన్యాన్ని విమర్శిస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశారు. జియో న్యూస్ నివేదిక ప్రకారం, ఒక మహిళా న్యాయవాదిని గత వారం ఆమె కార్యాలయంలోనే కొంతమంది కిడ్నాప్ చేశారు. ఆ తరువాత, మాల్సేలోని ధోడా రోడ్ వైపున ఉన్న పొలంలో ఆమె అపస్మారక స్థితిలో విసిరేశారు. ఆమె చేతులు కాళ్ళు కట్టి, అతని నోటిలో గుడ్డ కుక్కి తీవ్ర గాయాలతో విసిరేశారు. ఈ విషయాన్ని ప్రముఖ మానవ హక్కుల నేత అజాకియా వీడియో షేర్ చేసి బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. బాధితురాలు దీపాల్‌పూర్‌కు చెందినదని, ఆమెకు ఆరుగురు పిల్లలు ఉన్నారని తెలిపారు. ఆగస్టు 15 ఉదయం, వారిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, తరువాత చిత్రహింసలు పెట్టి పొలంలోకి విసిరేశారని ఆమె పేర్కొన్నారు.
This is the sad reality of the very oppressive military regime of 🍌Pakistan.
This is advocate Ishrat Nasteen. She made a speech against Army, in lawyers convention (see thread).
She got abducted & kept her for 4 days. Look what is her condition. See thread for her speech 1/2 pic.twitter.com/LuXo16AOYX
— Arif Aajakia (@arifaajakia) August 30, 2020
ఇదిలా ఉంటే పాకిస్తాన్లో సైన్యంపై విమర్శలు చేసిన ప్రజలపై ఎంత ఘోరమైన దాడులు ఉంటాయో మహిళా న్యాయవాది పరిస్థితి అద్దం పడుతోందని మానవ హక్కుల సంఘాలు వాపోతున్నాయి. పాకిస్తాన్ సైన్యం దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిందని వారు ఆరోపించారు. ఇమ్రాన్ ప్రభుత్వం ఒక తోలుబొమ్మ మాత్రమే అని విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pakistan, Pakistan army