పీవోకేలో భారత్ ఎలాంటి దాడి చేయలేదు...నిరూపించాలని పాక్ దౌత్యవేత్త సవాల్...

విదేశీ దౌత్యవేత్తలతో భారత ప్రతినిధులు పిఓకెలో సందర్శించి నిరూపించాలని పాక్ సైన్యం సవాలు చేసింది.

news18-telugu
Updated: October 21, 2019, 10:50 PM IST
పీవోకేలో భారత్ ఎలాంటి దాడి చేయలేదు...నిరూపించాలని పాక్ దౌత్యవేత్త సవాల్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పాక్‌ ఆక్రమిత్ కశ్మీరులోని మూడు ఉగ్రవాద శిబిరాలపై దాడుల ప్రకటనను పాకిస్తాన్ సైన్యం ఖండించింది. భారత్ వాదనలో వాస్తవం లేదని, సత్యదూరమైన ప్రకటనలతో భారత్ ఆరోపణలు చేస్తోందని పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల కార్యదర్శి మహ్మద్ ఫైజల్ పేర్కొన్నారు. అంతేకాదు విదేశీ దౌత్యవేత్తలతో భారత ప్రతినిధులు పిఓకెలో సందర్శించి నిరూపించాలని పాక్ సైన్యం సవాలు చేసింది. ఇదిలా ఉంటే ఆదివారం జమ్ము కశ్మీరులోని తంగ్‌ధర్, కేరాన్ సెక్టార్ల ఎదుట భారత సైన్యం జరిపిన ప్రతీకార దాడులలో ఆరుగురు నుంచి పది మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని మూడు ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ప్రకటించారు. రావత్ వంటి సైనిక దళాల ప్రధానాధికారి నుంచి ఇటువంటి ప్రకటన రావడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బూటకపు ప్రకటనల వల్ల ఆ ప్రాంతంలో శాంతికి విఘాతం ఏర్పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది సైనిక నైతిక విలువలకు విరుద్ధమని పాకిస్థాన్ సైనిక వర్గాలు ఆరోపించాయి.
Published by: Krishna Adithya
First published: October 21, 2019, 10:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading