అమ్మాయి, అబ్బాయి కలిసి తిరిగితే కఠిన చర్యలు.. భారీగా జరిమానా

అమ్మాయి, అబ్బాయిలు కలిసి తిరగడం నిషిద్ధమని..ఇది ఇస్లాంకు వ్యతిరేకమని అందులో పేర్కొన్నారు. ఎవరైనా జంటగా కనిపిస్తే తల్లిదండ్రులను పిలిపించి జరిమానాలను విధిస్తామని స్పష్టంచేశారు.

news18-telugu
Updated: September 26, 2019, 10:33 PM IST
అమ్మాయి, అబ్బాయి కలిసి తిరిగితే కఠిన చర్యలు.. భారీగా జరిమానా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విద్యాసంస్థల్లో స్టూడెంట్స్‌కు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. క్లాసులకు టైమ్‌కు రావాలని, లెక్చరర్లను గౌరవించాలని, క్యాంపస్‌లో ర్యాగింగ్ నిషేధమని, యూనిఫామ్ విధిగా ధరించాలని.. ఇలా పలు రకాల రూల్స్ ఉంటాయి. కానీ పాకిస్తాన్‌లోని ఓ యూనివర్సిటీ మాత్రం ఎవ్వరూ ఊహించని నిబంధన తీసుకొచ్చింది. యూనివర్సిటీలో క్యాంపస్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి తిరగకూడదట..! బాయ్స్, గర్ల్స్ కలిసి తిరిగితే కఠిన చర్యలతో పాటు భారీగా జరిమానాలకు విధిస్తామని స్పష్టం చేసింది.

ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బచాఖాన్ యూనివర్సిటీ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీ అసిస్టెంట్ చీఫ్ ప్రోక్టర్ ఫున్మనుల్లాన్ ఈ నోటీసు జారీ చేశారు. అమ్మాయి, అబ్బాయిలు కలిసి తిరగడం నిషిద్ధమని..ఇది ఇస్లాంకు వ్యతిరేకమని అందులో పేర్కొన్నారు. ఎవరైనా జంటగా కనిపిస్తే తల్లిదండ్రులను పిలిపించి జరిమానాలను విధిస్తామని స్పష్టంచేశారు. ఐతే ఈ నిబంధనలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ కాలంలో కూడా ఇలాంటి కట్టుబాట్లేంటని.. ఇలాంటి నిబంధనలు సిగ్గుచేటని మండిపడుతున్నారు.

First published: September 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading