పాకిస్తాన్‌లో రూ.20 తగ్గిన పెట్రోల ధర... రేపటి నుంచే అమల్లోకి..

పెట్రోల్ ధరను లీటర్‌కు రూ.20మేర తగ్గించాలని పాకిస్తాన్‌ నిర్ణయించింది. మే 1 నుంచి ధరలు తగ్గనున్నాయి.

news18-telugu
Updated: April 30, 2020, 10:59 PM IST
పాకిస్తాన్‌లో రూ.20 తగ్గిన పెట్రోల ధర... రేపటి నుంచే అమల్లోకి..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.20 వరకు తగ్గనుంది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పతనం అవుతున్నాయి. ఈ క్రమంలో పెట్రోల్ ధరను లీటర్‌కు రూ.20మేర తగ్గించాలని పాకిస్తాన్‌ నిర్ణయించింది. మే 1 నుంచి ధరలు తగ్గించనున్నట్టు డాన్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. వివిధ రకాల ఆయిల్ ఉత్పత్తులను ప్రస్తుతం ఉన్న ధరల మీద 57 శాతం వరకు తగ్గించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ధరలు తగ్గించిన తర్వాత హైస్పీడ్ డీజిల్ ధర రూ.33.94 అవుతుంది. పెట్రోల్ ధర రూ.20.68 వరకు తగ్గవచ్చని అంచనా. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌ (ఐఎంఎఫ్‌) తో చర్చించిన తర్వాత పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు డాన్ పత్రిక తెలిపింది.
First published: April 30, 2020, 10:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading