భారత్‌ను రెచ్చగొడుతున్న పాక్.. అణ్వాయుధ క్షిపణిని పరీక్షించిన దాయాది దేశం..

Pakistan: భారత్‌ను మరింత రెచ్చగొట్టేందుకు పాక్ మరో దుందుడుకు చర్యకు పాల్పడింది. ఉపరితలం నుంచి ఉపరితలాన్ని గురిపెట్టే అణ్వాయుధ క్షిపణి ‘ఘాజ్నవి’ని ప్రయోగించింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 29, 2019, 12:55 PM IST
భారత్‌ను రెచ్చగొడుతున్న పాక్.. అణ్వాయుధ క్షిపణిని పరీక్షించిన దాయాది దేశం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో పాక్ తోక వంకర అన్న చందంగా తయారైందీ వ్యవహారం. పాక్ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా సంయమనం పాటిస్తూ వస్తున్న భారత్‌ను మరింత రెచ్చగొట్టేందుకు పాక్ మరో దుందుడుకు చర్యకు పాల్పడింది. ఉపరితలం నుంచి ఉపరితలాన్ని గురిపెట్టే అణ్వాయుధ క్షిపణి ‘ఘాజ్నవి’ని ప్రయోగించింది. గురువారం తెల్లవారు జామున ఈ పరీక్షను నిర్వహించినట్లు పాకిస్తాన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. 290 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఇది ఛేదించగలదని వెల్లడించారు.

పరీక్ష విజయవంతమైందని, పాక్ అధ్యక్షుడు, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ సందర్భంగా ఆర్మీని అభినందించారని ఆయన పేర్కొన్నారు. పరీక్షకు సంబంధించిన 30 సెకన్ల వీడియోను కూడా జత చేశారు.

Published by: Shravan Kumar Bommakanti
First published: August 29, 2019, 12:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading