హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Pakistan Blast: చైనా రాయబారి లక్ష్యంగా పాకిస్తాన్‌లో పేలుడు.. కారు నిండా బాంబులు నింపి..

Pakistan Blast: చైనా రాయబారి లక్ష్యంగా పాకిస్తాన్‌లో పేలుడు.. కారు నిండా బాంబులు నింపి..

క్వెట్టాలో బాంబు పేలుడు

క్వెట్టాలో బాంబు పేలుడు

క్వెటాలోని సెరీనా హోటల్ చాలా ఫేమస్. రాజకీయ నేతలు, నగరానికి వచ్చే ప్రముఖులు అక్కడే బస చేస్తుంటారు. అలాంటి హోటల్‌లో కారు బాంబు పేలుడు జరగడం ఇప్పుడు చర్చనీయాంశమయింది.

పాకిస్తాన్‌లో మళ్లీ బాంబుల మోత మోగింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెటాలోని ఓ లగ్జరీహోట్‌లో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. 16 మందికి గాయాలయ్యాయి. పాకిస్తాన్‌లోని చైనా రాయబారి లక్ష్యంగా బాంబు దాడి జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. క్వెటాలోని సెరీనా హోటల్‌లో ఆయన బస చేశారు. ఆ హోటల్ కారు పార్కింగ్ వద్ద పేలుడు సంభవించింది. ఐతే ఘటన సమయంలో చైనా రాయబారి నాంగ్‌రాంగ్ హోటల్‌లో లేరు. క్వెటాలోని వేరొక ప్రాంతంలో ఓ వేడుకలో ఉన్నారు. పేలుడు జరిగినప్పుడు ఆయన హోటల్‌లో లేకపోవడంతో పాకిస్తాన్ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

తామే ఈ దాడిచేసినట్లు పాకిస్తాన్ తాలిబన్లు ప్రకటించారు. అంతకు మించి ఎలాంటి ఇతర వివరాలను వెల్లడించలేదు. క్వెటాలోని సెరీనా హోటల్ చాలా ఫేమస్. రాజకీయ నేతలు, నగరానికి వచ్చే ప్రముఖులు అక్కడే బస చేస్తుంటారు. అలాంటి హోటల్‌లో కారు బాంబు పేలుడు జరగడం ఇప్పుడు చర్చనీయాంశమయింది. కారులో పేలుడు పదార్థాలు నింపి పేల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు. పేలుడు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కారు నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి.క్వెటా బాంబు పేలుడు ఘటనను పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. ఇది పిరికిచర్యగా అభివర్ణించారు. పేలుడులో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధించిందని అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు పాకిస్తాన్ ఎన్నో త్యాగాలను చేసిందని..మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతర్గత ముప్పుతో పాటు బయటి నుంచి పొంచి వున్న ముప్పు పట్ల అప్రమత్తంగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.

First published:

Tags: Bomb blast, Pakistan

ఉత్తమ కథలు