భారత్‌పై పాక్ భారీ ఉగ్ర దాడులు.. హెచ్చరించిన అమెరికా

జమ్మూ కాశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక హోదా ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో భారత్‌పై పాక్ ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని అమెరికా తెలిపింది. ఈ విషయంలో అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని వెల్లడించింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 3, 2019, 7:06 AM IST
భారత్‌పై పాక్ భారీ ఉగ్ర దాడులు.. హెచ్చరించిన అమెరికా
భారత్‌పై పాక్ ఉగ్రదాడి చేస్తుందన్న అమెరికా
  • Share this:
జమ్మూ కాశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక హోదా ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో భారత్‌పై పాక్ ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని అమెరికా తెలిపింది. ఈ విషయంలో అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని వెల్లడించింది. ఉగ్రవాద సంస్థలను ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అవసరం ఉందని, లేని పక్షంలో ఉగ్రవాదులు భారత్‌పై రెచ్చిపోయే ప్రమాదం ఉందని వివరించింది. పరోక్షం పాక్ వ్యక్తిత్వాన్ని బయట పెట్టిన అమెరికా.. ఈ దాడులకు సంబంధించి పాకిస్తాన్‌కు చైనా మద్దతు ఇవ్వకపోవచ్చని పెంటగాన్ అధికారి ఒకరు తెలిపారు. ఉగ్ర దాడులను, ఘర్షణలను చైనా కోరుకోదని తాము విశ్వసిస్తున్నట్లు వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఉగ్రవాదులు శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారని భారత్ పదే పదే చెబుతున్న నేపథ్యంలో అమెరికా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలా ఉండగా, అంతర్జాతీయంగా పాకిస్తాన్‌కు చైనా మద్దతు తెలుపుతూ వస్తోందని, ఒకానొక సందర్భంలో ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ అంశం చర్చించాలా? వద్దా? అన్నదానిపై డ్రాగన్ దేశం మల్లగుల్లాలు పడిందని అమెరికా తెలిపింది.

First published: October 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు