news18-telugu
Updated: January 24, 2020, 9:08 AM IST
ప్రతీకాత్మక చిత్రం
పాక్ తోక వంకర అన్న నానుడికి తగ్గట్లే దాయాదిదేశం మరోసారి భారత్‌ను రెచ్చగొట్టింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో పాకిస్థాన్ క్షిపణి పరీక్ష చేపట్టింది. బాలిస్టిక్ క్షిపణి ఘజ్నవిని గురువారం పాక్ విజయవంతంగా పరీక్షించినట్లు పాక్ ఆర్మీ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్(ISPR) అధికారిక ప్రకటన చేసినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. వివిధ రకాల వార్ హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే ఘజ్నవి క్షిపణి 290 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరుకోగలదు.
జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన తర్వాత దురహంకార పాక్ రగిలిపోతోంది. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో క్షిపణి ప్రయోగంతో మరోసారి భారత్‌ను రెచ్చగొట్టింది ఇమ్రాన్ ఖాన్ సర్కారు.
Published by:
Janardhan V
First published:
January 24, 2020, 9:08 AM IST