పాకిస్థాన్ పరువు గోవిందా...ఆయిల్ నిక్షేపాల కోసం అత్యాశతో రూ. 700 కోట్లు వృధా...

కరాచీ తీరంలో అరేబియా సముద్రంలో ఆఫ్‌షోర్ ఆయిల్ నిక్షేపాలు భారీగా బయటపడే అవకాశం ఉందని... పాకిస్థాన్ కష్టాలు తీరిపోతాయంటూ... సాక్షాత్తూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్వయంగా ప్రకటించడంతో ఈ అంశంపై సర్వత్రా చర్చ జరిగింది.

news18-telugu
Updated: May 19, 2019, 7:09 PM IST
పాకిస్థాన్ పరువు గోవిందా...ఆయిల్ నిక్షేపాల కోసం అత్యాశతో రూ. 700 కోట్లు వృధా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరాచీ తీర ప్రాంతంలో ఆయిల్ గ్యాస్ నిక్షేపాల కోసం పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్ పడింది. అరేబియన్ ఆఫ్ షోర్‌లో గత కొంతకాలంగా పాకిస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ పరిశోధనలు జరపగా ఆయిల్ నిక్షేపాలకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో డ్రిల్లింగ్ పనులను నిలిపివేసింది. అయితే ఆయిల్ వెలికితీతకు సంబంధించిన పరిశోధనలు మాత్రం కొనసాగుతాయని సాంకేతిక బృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే కరాచీ తీరంలో అరేబియా సముద్రంలో ఆఫ్‌షోర్ ఆయిల్ నిక్షేపాలు భారీగా బయటపడే అవకాశం ఉందని... పాకిస్థాన్ కష్టాలు తీరిపోతాయంటూ... సాక్షాత్తూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్వయంగా ప్రకటించడంతో ఈ అంశంపై సర్వత్రా చర్చ జరిగింది. మరోవైపు కరాచీ తీరప్రాంతంలో ఆయిల్ నిక్షేపాల కోసం జరుగుతున్న అన్వేషణ కొత్త అంశమేమి కాదని, ఇప్పటికే 17 సార్లు అరేబియా తీరంలో డ్రిల్లింగ్ నిర్వహించినట్లు పాకిస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ సంస్థ తెలిపింది. అయితే ప్రస్తుతం డ్రిల్లింగ్ జరిపిన కెక్రా-1 సైట్ లో ఆయిల్ నిక్షేపాలపై పాకిస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ భారీగా ఆశలు పెట్టుకుంది. దాదాపు 5500 మీటర్ల మేర ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ నిర్వహించారు. అయితే ఎలాంటి ఆయిల్ ఆనవాళ్లు కనపడక పోవడంతో డ్రిల్లింగ్ పనులు నిలిపివేస్తున్నట్లు సంస్థ సీనియర్ అధికారి తెలిపారు. మరోవైపు పాకిస్థాన్ పరువు పోయిందని, సరైన అవగాహన లేకుండా సాంకేతిక బృందం ప్రజాధనం వృధా చేసిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

ఇదిలాఉంటే ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే పాకిస్థాన్ రూ.700 కోట్లు ఖర్చు పెట్టింది. అయితే భవిష్యత్తులో జరిపే ఇతర పరిశోధనలకు ఈ అనుభవం ఉపయోగపడుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే ప్రాజెక్టులో పాకిస్థాన్ పెట్రోలియం లిమిటెడ్‌తో పాటు ఎక్సాన్ మొబిల్, ఇటాలియన్ ఆయిల్ సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి.

First published: May 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>