ఎట్టకేలకు తల్లిదండ్రులను చేరిన పాకిస్థాన్ సిక్కు యువతి... అసలేం జరిగిందంటే...

Pakistan : భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య జరిగిన ఈ సంఘటన మరింత కాకరేపింది. దీనిపై పాక్ ప్రధాని చర్యలు తీసుకోవాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ డిమాండ్ చేశారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 31, 2019, 7:42 AM IST
ఎట్టకేలకు తల్లిదండ్రులను చేరిన పాకిస్థాన్ సిక్కు యువతి... అసలేం జరిగిందంటే...
బాధితురాలు జగ్జీత్ కౌర్. (Image : Twitter - ANI)
  • Share this:
జమ్మూకాశ్మీర్ అంశంలో భారత్‌తో యుద్ధం చేస్తామని పాకిస్థాన్ చేసిన ప్రకటనపై మనమంతా చర్చించుకుంటున్న సమయంలో... అదే పాకిస్థాన్‌లో జరిగిన దారుణం ఇది. పాకిస్థాన్‌కి చెందిన ఓ సిక్కు అమ్మాయి... కొన్ని రోజులుగా కనిపించట్లేదు. ఏమైపోయిందా అని అన్వేషిస్తే షాకింగ్ విషయం తెలిసింది. ఆమెను కిడ్నాప్ చేసి... బలవంతంగా మత మార్పిడి చేయించేశారు. ఇస్లాం మతంలోకి మార్పించేశారు. అంతేకాదు... ఓ ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేశారు. లాహోర్‌లోని నన్కానా సాహిబ్ ఏరియాలో ఈ తతంగం జరిగింది. బాధితురాలి పేరు జగ్జీత్ కౌర్. మత మార్పిడి తర్వాత ఆమె పేరును ఆయేషాగా మార్చారు. ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో... ఈ విషయం బయటికొచ్చింది.

జగ్జీత్ కౌర్ వయసు 17 ఏళ్లు. మైనర్. ఆమె గురుద్వారా నన్కానా సాహిబ్ అనే సిక్కు మత పెద్ద కూతురు. ఓ ముస్లిం గ్యాంగ్ ఆమెను కిడ్నాప్ చేసినట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది. ఈ విషయంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ జోక్యం చేసుకోవాలని బాధితురాలి కుటుంబం డిమాండ్ చేసింది. ఈ విషయంలో భారత్ కూడా జోక్యం చేసుకొని... పాకిస్తాన్ ప్రధానిపై ఒత్తిడి తేవాలని శిరోమణీ అకాళీదళ్ పార్టీ కోరుతోంది. సిక్కుల స్వేచ్ఛను హరిస్తున్న ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది. సిక్కు కమ్యూనిటీకి చెందిన చాలా మంది గురుద్వారా నన్కానా సాహిబ్ దగ్గర ధర్నా చేశారు. బాధితురాలిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఒత్తిళ్లు రావడంతో... కిడ్నాప్ గ్యాంగ్ ఆమెను విడిచిపెట్టింది. శుక్రవారం రాత్రి ఆమె... తన తల్లిదండ్రుల్ని చేరుకుంది.


భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య జరిగిన ఈ సంఘటన మరింత కాకరేపింది. దీనిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెంటనే చర్యలు తీసుకోవాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ డిమాండ్ చేశారు. భారత కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా పాకిస్థాన్‌పై ఒత్తిడి తేవాలని కోరారు. పాకిస్థాన్‌లోని పంజాప్ ప్రాంత ముఖ్యమంత్రి సర్దార్ ఉస్మాన్ బజ్దార్... ఈ ఘటనపై దర్యాప్తుకి ఆదేశించారు.
First published: August 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>