భారత్ దెబ్బకు పాక్ బెంబేలు.. ఉగ్ర స్థావరాలు మార్పు?

భారత్ సరిహద్దుల్లో ఉన్న జైష్ ఈ మొహ్మద్, లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన స్థావరాలను అఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోకి మార్చినట్టు తెలిసింది.

news18-telugu
Updated: July 7, 2019, 5:13 PM IST
భారత్ దెబ్బకు పాక్ బెంబేలు.. ఉగ్ర స్థావరాలు మార్పు?
జైషేమహ్మద్ ట్రైనింగ్ సెంటర్‌గా భావిస్తున్న ఉపగ్రహ చిత్రం (Image: Reuters)
  • Share this:
బాలాకోట్‌లో ఎయిర్ స్ట్రైక్ దెబ్బకు పాకిస్తాన్ బెంబేలెత్తినట్టు కనిపిస్తోంది. ఫిబ్రవరి 27న బాలాకోట్‌తో పాటు మరో రెండు చోట్ల ఎయిర్ స్ట్రైక్ చేసింది. దీంతో మరోసారి కూడా ఎయిర్ స్ట్రైక్ జరుగుతుందని పాకిస్తాన్ భయపడింది. ఈ క్రమంలో భారత్ సరిహద్దుల్లో ఉన్న జైష్ ఈ మొహ్మద్, లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన స్థావరాలను అఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోకి మార్చినట్టు తెలిసింది. భారత్‌కు వ్యతిరేకంగా ఈ రెండు ఉగ్రవాద సంస్థలు టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాలను కొనసాగించేందుకే ఇలా చేసినట్టు తెలిసింది. అఫ్ఘనిస్తాన్‌లో మిలిటెంట్ కార్యక్రమాలను నడుపుతున్న హక్కానీ నెట్ వర్క్‌తో ఈ రెండు సంస్థలు చేతులు కలిపినట్టు తెలిసింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు పాకిస్తాన్ - అఫ్ఘాన్ సరిహద్దుల్లో నంగర్ హర్, నూరిస్తార్, కునార్, హెల్మండ్, కాందహార్ ప్రావిన్స్‌లో ఎల్‌ఈటీ, జేఈఎమ్ క్యాంప్స్ పెట్టినట్టు తెలిసింది.

మరోవైపు జైష్ ఈ మొహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి భద్రతా కౌన్సిల్. దీంతో అతడికి తాలిబన్లు రక్షణ కల్పించేందుకు ముందుకొచ్చినట్టు సమాచారం. అయితే, ఆ ఆఫర్‌ను మసూద్ అజర్ నిరాకరించారని, పాకిస్తాన్ ఐఎస్ఐ రక్షణలో బాహావల్‌పూర్‌లో ఉండేందుకే మొగ్గుచూపినట్టు తెలిసింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 7, 2019, 5:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading