పాకిస్తాన్ మరో ఉగ్ర కుట్ర.. మసూద్ అజార్‌ను విడుదల చేసి..!

గతంలో జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అరెస్టు చేసిన ఇమ్రాన్ ఖాన్ సర్కారు.. అతడ్ని రహస్యంగా విడుదల చేసినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరోకి సమాచారం అందింది. దీంతో ఐబీ వర్గాలు ప్రభుత్వాన్ని అలర్ట్ చేశాయి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 9, 2019, 11:26 AM IST
పాకిస్తాన్ మరో ఉగ్ర కుట్ర.. మసూద్ అజార్‌ను విడుదల చేసి..!
మసూద్ అజార్(File)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 9, 2019, 11:26 AM IST
జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత భారత్‌పై పాకిస్తాన్, ఆ దేశ రాజకీయ నాయకులు విషం కక్కుతూనే ఉన్నారు. మరోవైపు పాక్ రేంజర్లు కూడా సరిహద్దుల్లో దాడులకు దిగుతున్నారు. ఇంకోవైపు దాదాపు 200 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఇలా.. దాయాది దేశం భారత్‌పై పగతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో మరో కుట్రకు ఆ దేశం పావులు కదుపుతోందా? దాడులకు తెగబడేందుకు సిద్ధమవుతోందా? అంటే తాజా సమాచారం ప్రకారం అవుననే తెలుస్తోంది. గతంలో జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అరెస్టు చేసిన ఇమ్రాన్ ఖాన్ సర్కారు.. అతడ్ని రహస్యంగా విడుదల చేసినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరోకి సమాచారం అందింది. దీంతో ఐబీ వర్గాలు ప్రభుత్వాన్ని అలర్ట్ చేశాయి.

రాజస్థాన్-కాశ్మీర్ సెక్టార్లలో భారీ కుట్రకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని, అందుకే.. ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేసేందుకు రెండ్రోజుల క్రితం అజార్‌ను విడుదల చేసిందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో పంజాబ్‌, రాజస్థాన్‌, సియోల్‌కోట ప్రాంతాల్లో భారత భద్రతా బలగాలను అప్రమత్తం చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా, మసూద్ అజార్‌ను ఉగ్రవాదిగా మోదీ సర్కారు గుర్తించిన సంగతి తెలిసిందే.

First published: September 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...