ఆరెస్సెస్‌పై ఇమ్రాన్‌ ఖాన్ ఫైర్.. హిట్లర్‌తో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు..

Pak PM Imran Khan: జర్మనీలో నాజీ సిద్ధాంతాలు, భావజాలంతో ఆరెస్సెస్‌ స్ఫూర్తి పొందిందని విమర్శించారు. కశ్మీర్‌లో కర్ఫ్యూ, అణచివేత, సామూహిక హత్యలకు ఆ సంస్థ కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 11, 2019, 9:09 PM IST
ఆరెస్సెస్‌పై ఇమ్రాన్‌ ఖాన్ ఫైర్.. హిట్లర్‌తో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు..
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
  • Share this:
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మారోసారి బీజేపీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌పై నిప్పులు చెరిగారు. జర్మనీలో నాజీ సిద్ధాంతాలు, భావజాలంతో ఆరెస్సెస్‌ స్ఫూర్తి పొందిందని విమర్శించారు. కశ్మీర్‌లో కర్ఫ్యూ, అణచివేత, సామూహిక హత్యలకు ఆ సంస్థ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కశ్మీర్ భౌగోళిక స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని, జాతి హననం ద్వారా లోయను సర్వనాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నాజీ జాతీయవాదం తరహాలో ఆరెస్సెస్ హిందూ జాతీయవాదం కేవలం కశ్మీర్ వరకే ఆగిపోదు. భారత్‌లోని ముస్లింలదరినీ వీళ్లు అణచివేస్తారు. చివరికి పాకిస్థాన్ ను లక్ష్యంగా చేసుకుంటారు. వీళ్లంతా హిట్లర్ జాతీయవాదానికి హిందూ వెర్షన్ లాంటివాళ్లు. ప్రపంచదేశాలు దీన్ని చూసిచూడనట్లు ఊరుకుంటాయా?’ అని ఇమ్రాన్ ప్రశ్నించారు.


First published: August 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading