Pakistan Prime Minister Imran Khan | పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మళ్లీ భారత్‌పై నోరు పారేసుకొన్నారు. భారతదేశంలోని మైనారిటీలను తీవ్రవాద గ్రూపులు లక్ష్యంగా చేసుకుంటున్నాయని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిరాధార ఆరోపణలు చేశారు. అటువంటి ఎజెండా ప్రాంతీయ శాంతికి "నిజమైన మరియు ప్రస్తుత ముప్పు" అని ఆయన అన్నారు.
పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ (Imran Khan) మళ్లీ భారత్‌పై నోరు పారేసుకొన్నారు. భారతదేశంలోని మైనారిటీలను తీవ్రవాద గ్రూపులు లక్ష్యంగా చేసుకుంటున్నాయని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిరాధార ఆరోపణలు చేశారు. అటువంటి ఎజెండా ప్రాంతీయ శాంతికి "నిజమైన మరియు ప్రస్తుత ముప్పు" అని ఆయన అన్నారు. డిసెంబరులో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ముస్లింలపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఖాన్ ట్విట్టర్ (Twitter) లో ఈ ఆరోపణలు చేశారు. భారతదేశంలోని మైనారిటీలను ఇబ్బంది పెట్డడానికి బిజెపి ప్రభుత్వం మద్దతు ఇస్తుందా ? అని కూడా ఖాన్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ప్రశ్నించారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజం గమనించి చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
మరో ట్వీట్లో, భారతదేశంలోని మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ఉందని ఖాన్ ఆరోపించారు, తీవ్రవాద ఎజెండా "మా ప్రాంతంలో శాంతికి నిజమైన మరియు ప్రస్తుత ముప్పు" అని అన్నారు. అంతే కాకుండా గత నెలలో, పాకిస్తాన్ (Pakistan) విదేశాంగ కార్యాలయం భారతదేశం యొక్క ఛార్జ్ డి అఫైర్స్‌ను పిలిపించింది. హరిద్వార్ కాన్క్లేవ్లో చేసిన ద్వేషపూరిత ప్రసంగాలపై తన ఆందోళనను తెలియజేసింది.
డిసెంబర్ 17-20 వరకు హరిద్వార్ (Haridwar) లో జరిగిన ఈ ధర్మ సంసద్‌ను జునా అఖాడాకు చెందిన యతి నరసింహానంద గిరి నిర్వహించారు. అతను ఇప్పటికే పలు ప్రసంగాలు చేసిన కారణంగా ఆయనను పోలీసులు గమనిస్తునే ఉన్నారు. అయితే ఇటీవల హిందూ మతంలోకి మారిన తర్వాత తన పేరును జితేంద్ర నారాయణ్ త్యాగిగా మార్చుకున్న వసీం రిజ్వీ, ఘజియాబాద్‌లోని దాస్నా ఆలయ ప్రధాన పూజారి సన్సద్ యతి నరసింహానంద్ నిర్వాహకుడు సహా 15 మందిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
సుప్రీం కోర్టులో కేసు..
ఇటీవల జరిగిన సదస్సులో ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్) విచారించేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం సోమవారం అంగీకరించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ చేసిన వాదనలను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.