హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ వాటిని కూడా వదల్లేదా ?.. అన్ని కోట్లకు అమ్ముకున్నారా ?

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ వాటిని కూడా వదల్లేదా ?.. అన్ని కోట్లకు అమ్ముకున్నారా ?

ఇమ్రాన్ ఖాన్(ఫైల్ ఫొటో)

ఇమ్రాన్ ఖాన్(ఫైల్ ఫొటో)

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ తన హయాంలో రూ.14 కోట్లకు తోషాఖానా బహుమతులను దుబాయ్‌లో విక్రయించారని ప్రధాని షాబాజ్ షరీఫ్ చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

విదేశీ నేతలు బహుమతిగా ఇచ్చిన మూడు ఖరీదైన వాచీలను అక్రమంగా విక్రయించి పాకిస్థాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రూ.3.6 కోట్లు సంపాదించారు. ఈ మేరకు బుధవారం ఓ మీడియా వార్తా కథనంలో పేర్కొంది. జియో న్యూస్‌తో పంచుకున్న అధికారిక దర్యాప్తు వివరాల ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో..15.4 కోట్ల రూపాయల విలువైన ఈ రత్నాలు పొదిగిన విలువైన వాచీల (Costly Watches) ద్వారా కోటి రూపాయలను సంపాదించారు. అత్యంత ఖరీదైన వాచ్ ఖరీదు రూ. 10.1 కోట్లు అని, దాని ధరలో 20 శాతం చెల్లించి మాజీ ప్రధాని తన వద్ద ఉంచుకున్నారని వార్తల్లో వచ్చింది. అంతకుముందు ప్రభుత్వం తోషాఖానా నిబంధనలను మార్చింది. అసలు ధరలో 50 శాతం చెల్లించి బహుమతులు ఉంచుకోవచ్చని నిర్ణయించింది.

మాజీ క్రికెటర్ తన సొంత డబ్బుతో తోషాఖానా నుండి ఈ విలువైన వాచీలను కొనుగోలు చేయకుండా.. మొదట వాచీలను విక్రయించి, ఒక్కో వాచ్ విలువలో 20 శాతం ప్రభుత్వ ఖజానాలో జమ చేసినట్లు పత్రాలు, విక్రయ రశీదులు బయటకొచ్చాయి. స్పష్టంగా బహుమతులు తోషాఖానాలో ఎప్పుడూ జమ చేయబడలేదు. ఏ ప్రభుత్వ అధికారి అయినా అందుకున్న బహుమతి గురించి వెంటనే తెలియజేయడం అవసరం, తద్వారా దాని విలువను అంచనా వేయవచ్చు. ఏ అధికారి అయినా బహుమతిని తన వద్ద ఉంచుకోవాలనుకుంటే ముందుగా డిపాజిట్ చేసి, నిర్ణీత ధర చెల్లించిన తర్వాత తీసుకోవచ్చు.

గల్ఫ్‌లోని మిత్రరాజ్యాలు తనకు ఇచ్చిన ఈ ఖరీదైన వాచీలను విక్రయించడం ద్వారా ఖాన్ రూ. 3.6 కోట్లు సంపాదించాడు. ఒక వాచీని 22 జనవరి 2019న అమ్మేశారు. అంతకుముందు అప్పటి PTI ప్రభుత్వం నిబంధనలను సవరించింది. ఏదైనా బహుమతిని దాని స్థిర విలువలో 20 శాతం నుండి 50 శాతానికి నిర్ణయించింది. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ (పిటిఐ)కి సారథ్యం వహిస్తున్న 69 ఏళ్ల ఖాన్ గతంలో జర్నలిస్టులతో అనధికారిక ఇంటరాక్షన్ సందర్భంగా మేరా తోఫా మేరీ మార్జి ( నా కానుకలు నా ఇష్టం)అని అన్నారు.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ మామూలోడు కాదు.. బండారం బయటపెట్టిన వైట్ హౌస్ ఉద్యోగి

Dutch MP Geert Wilder : ఇస్లాం పట్ల మెతక వైఖరి వద్దు..ఉదయ్ పూర్ హత్య ఘటనపై డచ్ ఎంపీ

ఖాన్ తన హయాంలో రూ.14 కోట్లకు తోషాఖానా బహుమతులను దుబాయ్‌లో విక్రయించారని ప్రధాని షాబాజ్ షరీఫ్ చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించిన ఇమ్రాన్ ఖాన్.. జర్దారీ, షరీఫ్ కుటుంబాలు విదేశాల్లో దాచుకున్న బిలియన్ల డాలర్లను వెనక్కి తీసుకువస్తేనే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోగలదని ఆరోపించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సార్వత్రిక ఎన్నికలు జరగాలనే డిమాండ్‌ను పునరుద్ఘాటించిన ఇమ్రాన్ ఖాన్, దేశాన్ని రాజకీయ గందరగోళం నుండి బయటకు తీసుకురావడానికి ఇదే ఏకైక మార్గమని అన్నారు.

First published:

Tags: Imran khan, Pakistan

ఉత్తమ కథలు