news18-telugu
Updated: August 29, 2019, 10:56 PM IST
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఘోర అవమానం ఎదురైంది. కరెంటు బిల్లులు కట్టలేదన్న కారణంతో ప్రధానమంత్రి కార్యాలయానికి విద్యుత్ శాఖ అధికారులు కరెంటు కనెక్షన్ కట్ చేశారు. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం సెగ ఆ దేశ ప్రధాని కార్యాలయానికి కూడా తగిలింది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కార్యాలయం విద్యుత్ బిల్లులు చెల్లించకపోవటంతో విద్యుత్ సరఫరా చేస్తున్న ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లయి కంపెనీ విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. తమకు ప్రధాని కార్యాలయం నుండి దాదాపు 41 లక్షల రూపాయల బకాయిలు రావల్సి వుందని ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లయి కంపెనీని ఉటంకిస్తూ పాక్ మీడియా వెల్లడించింది. గత కొద్ది నెలలుగా ప్రధాని సెక్రటేరియట్ తమకు విద్యుత్ బిల్లులు చెల్లించటం లేదని ఈ సంస్థ మీడియాకు చెప్పింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
August 29, 2019, 10:54 PM IST