బిన్ లాడె‌న్‌ను అమరవీరుడిగా కీర్తించిన ఇమ్రాన్ ఖాన్

ప్రపంచాన్ని వణికించిన ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అల్ ఖైదా సంస్థ వ్యవస్థాపకుడు అయిన ఒసామా బిన్ లాడెన్‌ను అమరవీరుడిగా కీర్తించారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.

news18-telugu
Updated: June 25, 2020, 7:22 PM IST
బిన్ లాడె‌న్‌ను అమరవీరుడిగా కీర్తించిన ఇమ్రాన్ ఖాన్
ఇమ్రాన్ ఖాన్ (Credit - Twitter - PTI)
  • Share this:
ప్రపంచాన్ని వణికించిన ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అల్ ఖైదా సంస్థ వ్యవస్థాపకుడు అయిన ఒసామా బిన్ లాడెన్‌ను అమరవీరుడిగా కీర్తించారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ పార్లమెంట్‌లో ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్.. ‘అమెరికా వాళ్లు అబోటాబాద్ వచ్చి బిన్ లాడెన్‌ను చంపారు. అదే అమరుడిని చేశారు.’ అని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని టెలివిజన్ ఛానల్స్‌లోనూ ఈ లైవ్ ప్రసారం అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. మొదటిసారి బిన్ లాడెన్‌ను చంపేశారు అన్న ఇమ్రాన్ ఖాన్ మళ్లీ వెంటనే అమరుడిని చేశారని వ్యాఖ్యానించారు. సాధారణంగా సైనికులు తమ దేశం కోసం పోరాడుతూ శత్రువుల చేతిలో మరణిస్తే వారిని అమరజవాన్లు, అమరవీరులు అంటారు. అలాగే, తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ప్రాణత్యాగాలు చేసిన వారిని కూడా అమరులుగా కీర్తిస్తూ ఉంటారు. కానీ, 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని ట్విన్ టవర్‌ను కూల్చివేయించి అగ్రరాజ్యం అమెరికాతో పాటు ప్రపంచం మొత్తాన్ని వణికించి, ఉగ్రవాదంతో ఎన్నో లక్షల మంది జీవితాలను ఛిద్రం చేసిన ఒసామా బిన్ లాడెన్‌ను ఇమ్రాన్ ఖాన్ అమరవీరుడిగా కీర్తించడం గమనార్హం.

అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికాకు చెందిన నేవీ సీల్ టీమ్ అంతమొందించింది. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో దాక్కున్న అతడిని అమెరికన్ సేనలు 2011 మే 2వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మెరుపుదాడి చేసి మట్టుబెట్టాయి. అప్పడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఒసామా బిన్ లాడెన్‌ను అంతం చేసేందుకు అమెరికా పెట్టిన ఆపరేషన్ పేరు ‘ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్’. పాకిస్తాన్‌కు ఆనుకుని ఉన్న అప్ఘానిస్తాన్‌ నుంచి అర్ధరాత్రి సమయంలో పాక్ బలగాలకు కూడా తెలియకుండా హెలికాప్టర్లల్లో వచ్చిన అమెరికా సేనలు లాడెన్‌ను అంతం చేశాయి. అనంతరం వెంటనే అతడి మృతదేహాన్ని తీసుకుని మళ్లీ అఫ్ఘనిస్తాన్ వెళ్లిపోయాయి. చనిపోయింది బిన్ లాడెన్ అని ధ్రువీకరించుకున్నాయి. అనంతరం అతడి శవాన్ని సముద్రంలో ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం ఖననం చేశారని ప్రచారంలో ఉంది. అయితే, ఆ ప్రదేశం ఏంటనేది రహస్యంగానే ఉండిపోయింది.

అమెరికా చేసిన పనిని ఆ దేశంలో 90 శాతం మంది ప్రజలు సమర్థించారు. ఐక్యరాజ్యసమితి, నాటో, యూరోపియన్, ఇతర ప్రపంచంలోని మెజారిటీ దేశాలు బిన్ లాడెన్ హత్యను స్వాగతించాయి. అయితే, పాకిస్తాన్‌లోని మూడింట రెండు వంతుల మంది ప్రజలు మాత్రం దీన్ని వ్యతిరేకించారు. ఈ ఘటనపై విచారణకు అప్పటి పాకిస్తాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ ఓ కమిటీని నియమించారు. ఆ ఘటనలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగం విఫలమైందని ఆ కమిటీ రిపోర్టులో పేర్కొంది.
First published: June 25, 2020, 6:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading