Imran Khan: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్... పదవీ గండం నుంచి గట్టెక్కారు. పాకిస్థాన్ పార్లమెంటైన... నేషనల్ అసెంబ్లీలో... 178 ఓట్లతో ఆయన విజయం సాధించారు. ఆయన పార్టీ PTIకి 173 ఓట్లు ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై.... విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ విశ్వాస తీర్మానం పెట్టడంతో... దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇమ్రాన్‌ఖాన్‌కి తలెత్తింది. ఐతే... తన పార్టీలోనే ఉన్న రెబెల్స్ తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఇమ్రాన్ ఖాన్ భావించారు. అలా ఎవరైనా చేస్తే... వారిపై అనర్హత వేటు వేస్తానని ముందే హెచ్చరించారు. మొత్తానికి ఆయన గెలవడంతో... తిరిగి ప్రధానిగా కొనసాగే అవకాశం దక్కింది.
బుధవారం సెనేట్ ఎన్నికలో ఆర్థిక మంత్రి అబ్దుల్ హఫీజ్ షేక్... ఓడిపోయారు. దాంతో... ప్రభుత్వానికి మద్దతు లేదనీ... ప్రధాని పదవికి 68 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్... రాజీనామా చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. దాంతో... పార్లమెంట్ లోని దిగువ సభలో బల నిరూపణకు ఇమ్రాన్ ఖాన్ సిద్ధపడ్డారు.
ఈ పరిస్థితుల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ... విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. మొత్తం 341 సీట్లలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం 171 ఓట్లు సాధించాల్సి ఉండగా... 178 ఓట్లు సాధించి... గట్టెక్కింది.
ఇది కూడా చదవండి: Elephant vs Buffalo: ఏనుగుతో పెట్టుకున్న గేదె... కొమ్ములతో ఫైట్... వైరల్ వీడియో
పాకిస్థాన్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఉండటం వల్ల ఇండియాకి కూడా కొంతవరకూ మేలే. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయిన తర్వాత... ఇండియాతో ప్రత్యక్ష యుద్ధం దిశగా ఆయన ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేదు. గత ప్రధానులు కొంతమంది ఇండియాతో యుద్ధాలు కూడా చేశారు. అయితే... భారత కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌కి అన్ని రకాలుగా చెక్ పెట్టడంతో... ఇక ఇండియాకి ఎదురు తిరగకుండా ఇమ్రాన్ ఖాన్ తన పాలన తాను చూసుకుంటున్నారు. ఐతే... ఇప్పటికీ పాకి సైన్యం, ఉగ్రవాదులూ... ఇండియాపై కుట్రలు పన్నుతూనే ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pakistan