పదేళ్ల క్రితం ఇదే రోజు భారత్, పాకిస్తాన్‌ల్లో కుప్పకూలిన విమానాలు...

2010 మే 22వ తేదీన భారత్ లోని మంగళూరు, పాకిస్తాన్‌లో కరాచీలో రెండు విమాన ప్రమాదాలు జరిగాయి.

news18-telugu
Updated: May 22, 2020, 5:45 PM IST
పదేళ్ల క్రితం ఇదే రోజు భారత్, పాకిస్తాన్‌ల్లో కుప్పకూలిన విమానాలు...
కరాచీలో కూలిన విమానం (Image Credit : Radio Pakistan)
  • Share this:
పాకిస్తాన్‌లో విమానం కుప్పకూలింది. 99 మంది ప్రయాణికులు, 8 మంది విమాన సిబ్బందితో లాహోర్ నుంచి కరాచీ వెళ్తున్న విమానం లాండింగ్‌కు నిమిషాల ముందు జనావాసాల మీద కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనేది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే, పదేళ్ల క్రితం ఇదే రోజు భారత్, పాకిస్తాన్‌లో రెండు విమాన ప్రమాదాలు జరిగాయి. 2010 మే 22న దుబాయ్ నుంచి కర్ణాటకలోని మంగళూరు వస్తున్న IX 812 నెంబర్ గల ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ మంగళూరులో కుప్పకూలింది. విమానం దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 166 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 158 మంది చనిపోయారు. ఆ మిగిలిన వారు కూడా రన్నింగ్‌లో కిందకు దూకి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకుని ప్రాణాలు కాపాడుకుతున్నారు. విమానం కూలిన తర్వాత రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించిన దేశం, ఓ స్మారక స్థూపాన్ని కూడా నిర్మించింది. ఇక పదేళ్ల క్రితం ఇదే రోజున (2010 మే 22) పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం ఇదే కరాచీ ఎయిర్ పోర్టులో కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: May 22, 2020, 5:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading