PAKISTAN PIA PILOT REFUSES TO FLY AFTER EMERGENCY LANDING AS HIS SHIFT HAD ENDED MKS
Pak pilot: విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. షిఫ్ట్ టైమ్ పూర్తయిందటూ పైలట్ జంప్.. చిక్కుకున్న ప్రయాణికులు
దమ్మమ్ ఎయిర్ పోర్ట్ లో పాక్ విమానం
ప్రయాణికుల భద్రత పట్ల పైలట్ చూపి శ్రద్ధకు అందరూ సంతోషించారు. కానీ తీరా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన తర్వాత.. అదే పైలట్ ప్రయాణికుల్ని గాలికొదిలేశాడు. సారీ, నా షిప్ట్ టైమ్ పూర్తయిపోయిందంటూ..
ఉరుములు, మెరుపుల మధ్యలో ప్రయాణించినప్పుడు కూడా వాళ్లు కంగారు పడలేదు. విమాన ప్రయాణం ఎలా ఉంటుందో సిబ్బంది ఎప్పటి కప్పుడు చెబుతూనే ఉండటంతో అందరూ కూల్ గా కూర్చున్నారు. అయితే పోను పోను పరిస్థితి ఇంకాస్త జఠిలంగా మారింది. దీంతో పైలట్ సారు ప్రయాణికులతో మాట్లాడాడు. మనందరం గమ్య స్థానానికి సురక్షితంగా వెళ్లేందుకు వాతావరణం అనుకూలించేలా లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా మధ్యలోనే ల్యాండ్ అవుతున్నామని చెప్పేశాడు. ప్రయాణికుల భద్రత పట్ల పైలట్ చూపి శ్రద్ధకు అందరూ సంతోషించారు. కానీ తీరా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన తర్వాత.. అదే పైలట్ ప్రయాణికుల్ని గాలికొదిలేశాడు. అప్పటివి వాతావరణం అనుకూలించినా, విమానాన్ని నడిపేందుకు నో చెప్పాడు. సారీ, నా షిప్ట్ టైమ్ పూర్తయిపోయిందంటూ చకచకా విమానం దిగి వెళ్లిపోయాడు. అతని చర్యకు ప్రయాణికులంతా షాకైపోయారు. గంటలపాటు విమానంలోనే చిక్కుకుపోయి హాహాకారాలు చేశారు..
పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) విమానంలో తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చకు నిలిచింది. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసిన పైలట్ ఆ తర్వాత మళ్లీ విధులు నిర్వహించేందుకు ససేమిరా అన్నాడు. తన డ్యూటీ టైం ముగిసిందని, వెంటనే విధులు చేపట్టలేనని తేల్చి చెప్పాడు. దీంతో విమానంలోనే గంటలపాటు ఉన్న ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
(పీఐఏ) చెందిన పీకే-9754 విమానం గత ఆదివారం సౌదీ అరేబియా రాజధాని రియాద్ నుంచి పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు బయలుదేరింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో పాక్ పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి సౌదీ అరేబియాలోని దమ్మమ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ప్రయాణికుల భద్రతపై ఆయన శ్రద్ధకు ప్రశంసలు వెల్లువెత్తేలోపే.. తన షిఫ్ట్ సమయం ముగిసిందని, ఇప్పుడే విధులు చేపట్టలేనని వెళ్లిపోయిన వైనం విమర్శలకు తావిచ్చింది.
పైలట్ వెళ్లిపోయిన తర్వాత కొన్ని గంటలపాటు ప్రయాణికులు లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. ఆలస్యానికి వ్యతిరేకంగా ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. పరిస్థితులు చేయిదాటిపోతుండటంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. విమానం ఎగిరేంతవరకు ప్రయాణికులకు ఓ హోటల్లో బస ఏర్పాటు చేశారు. మరుసటి రోజు రాత్రికిగానీ వాళ్లు గమ్యస్థానానికి చేరలేకపోయారు.
అయితే, విమానయానానికి సంబంధించి పైలట్ మోస్ట్ పవర్ ఫుల్ అన్నది తెలిసిందే. నిబంధనల ప్రకారం షిఫ్ట్ పూర్తయిన తర్వాత పైలట్లు విధులు నిర్వహిండం విరుద్ధం. కాబట్టే అతనలా చేశాడని, వందల మంది భద్రతతో ముడిపడిన అంశం కాబట్టి పైలట్‌కు విశ్రాంతి అవసరమని, ప్రయాణికులు ఎదుర్కొన్న అసౌకర్యానికి చింతితుస్తున్నామని పీఐఏ ఒక ప్రకటన విడుదల చేసింది. మరో పైలట్ విధుల్లో చేరిన తర్వాతగానీ విమానం మమ్మద్ నుంచి ఇస్లామాబాద్‌కు బయలుదేరింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.