పాక్ తోక వంకర...ఉగ్రవాద శిబిరాలను తెరిపించిన ఐఎస్ఐ..

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను తెరిపించే దిశగా అడుగులు వస్తోంది. అక్కడ నుంచే కాశ్మీర్ లోయలోకి ఉగ్రవాదులను ప్రవేశపెట్టేందుకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అన్ని విధాలా ప్రయత్నం చేస్తోంది.

news18-telugu
Updated: August 10, 2019, 7:36 PM IST
పాక్ తోక వంకర...ఉగ్రవాద శిబిరాలను తెరిపించిన ఐఎస్ఐ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆర్టికల్ 370 రద్దుతో రగిలిపోతున్న పాకిస్థాన్ ఎలాగైనా భారత్ ను చికాకు చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను తెరిపించే దిశగా అడుగులు వస్తోంది. అక్కడ నుంచే కాశ్మీర్ లోయలోకి ఉగ్రవాదులను ప్రవేశపెట్టేందుకు పాక నిఘా సంస్థ ఐఎస్ఐ అన్ని విధాలా ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు అనంతరం అక్కడ కొన్ని వర్గాలు చెందిన స్థానిక యువతలో వారి పట్టు జారిపోతుందనే భయంతోనే ఐఎస్ఐ ఇలా చేస్తోందని భారత రక్షణ దళాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించకుండా భారత దళాలు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ వెంబడి ఉన్న కోట్లీ, రావల్ కోట్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈ ఉగ్రవాద శిబిరాలు తెరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు తేల్చాయి.

First published: August 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు