ఆర్టికల్ 370 వెనక్కు తీసుకుంటే ఒప్పుకోం...పాక్ వింత వాదన...మా చట్టాలతో మీకేం పని అంటున్న భారత్...

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ...ఉద్దేశించిన ఆర్టికల్ 370ని వెనక్కి తీసుకుంటే సహించేది లేదని పాకిస్థాన్ ప్రకటన విడుదల చేసింది.

news18-telugu
Updated: April 6, 2019, 1:38 PM IST
ఆర్టికల్ 370 వెనక్కు తీసుకుంటే ఒప్పుకోం...పాక్ వింత వాదన...మా చట్టాలతో మీకేం పని అంటున్న భారత్...
ఇమ్రాన్ ఖాన్ (File)
news18-telugu
Updated: April 6, 2019, 1:38 PM IST
అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే ఇదే అన్నట్లు తయారైంది...పాకిస్థాన్ పరిస్థితి. భారత రాజ్యాంగ చట్లాలను మార్చవద్దని హెచ్చరికలు జారీ చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ...ఉద్దేశించిన ఆర్టికల్ 370ని వెనక్కి తీసుకుంటే సహించేది లేదని పాకిస్థాన్ ప్రకటన విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాశ్మీర్ నేతలు ఆర్టికల్ 370 విషయమై ఇటీవల వ్యాఖ్యలు చేయడం దానికి కౌంటర్‌గా బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో...మరోసారి ఈ చట్టం దేశవ్యాప్తంగా చర్చల్లో అంశంగా నిలిచింది. అయితే ఈ చట్టం పూర్తిగా భారత రాజ్యాంగానికి లోబడి ఉన్న అంతర్గత విషయం. పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయ అధికారి మహ్మద్ ఫైజ్ వారాంతపు ప్రెస్ బ్రీఫింగ్ లో భాగంగా ఆర్టికల్ 370పై పాకిస్థాన్ స్పందనను తెలియజేశారు.

పాకిస్థాన్ తరపున మాట్లాడిన ఫైజల్... భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని వెనక్కు తీసుకుంటే పాకిస్థాన్ అంగీకరించదని ప్రముఖంగా పేర్కొన్నారు. అలాగే కశ్మీరీల హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయని, యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ విధానాలను ఉల్లంఘించినట్లే అని వ్యాఖ్యలు చేశారు.

అయితే పాకిస్థాన్ మన రాజ్యాంగంలోని చట్టాల మార్పులు, చేర్పులపై వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇతర దేశాల రాజ్యాంగ పరిధిలోకి జొరబడి సలహాలు ఇవ్వక్కర్లేదని, ముందు సొంత ఇల్లు చక్కదిద్దుకోవాలని నెటిజన్లు మండిపడుతున్నారు.


First published: April 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...