పాకిస్థాన్ ఆర్థికంగా చితికిపోతోంది. అక్కడ కూడా త్వరలోనే శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభం రావడం ఖాయమనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అక్కడి ప్రజలు ఇందుకు సంబంధించిన పర్యవసానాలు ఎదుర్కొంటున్నారు. అయితే అక్కడి పాలకులకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. ఒకవైపు పాకిస్థాన్ తన ఖర్చులు భరించలేక ఇబ్బంది పడుతున్న ఈ ఎపిసోడ్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు ఇచ్చే నిధులను కూడా కట్ చేసింది. ఈ తగ్గింపు కారణంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా పరిస్థితి అధ్వాన్నంగా మారింది. అయినప్పటికీ అక్కడి పాలకులు వారి విలాసాలను ఏ మాత్రం వదులుకోవడం లేదు.
ఇటీవల పీఓకే ప్రభుత్వం 34 కోట్లు వెచ్చించి 72 కొత్త లగ్జరీ కార్లను కొనుగోలు చేసింది. అయితే ఈ నిర్ణయంపై స్థానిక ప్రజలు నిరసనకు దిగారు. అక్కడి అధ్యక్షుడు బారిస్టర్ సుల్తాన్ మహమూద్ కోసం పీవోకే ప్రభుత్వం ఈ లగ్జరీ కార్లన్నింటినీ కొనుగోలు చేసినట్టు ఓ వార్తా సంస్థ తెలిపింది. పాకిస్తాన్ ప్రభుత్వం తమ బడ్జెట్‌ను తగ్గించిందని పీఓకే ప్రభుత్వ మంత్రులు నిరంతరం ఫిర్యాదు చేస్తున్న సమయంలో ఈ వాహనాలన్నీ కొనుగోలు చేయడం గమనార్హం.
పాకిస్తాన్ ప్రభుత్వం పీవోకే అభివృద్ధి బడ్జెట్లో 2.5 బిలియన్ రూపాయలు తగ్గించింది. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు, స్థానిక సామాజిక సంస్థలు నిరసనకు దిగాయి. ఈ నిర్ణయం వల్ల పీఓకే ఆర్థిక వ్యవస్థ మరింత కుప్పకూలవచ్చని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే పీఓకే అధ్యక్షుడి ప్రతినిధి మాత్రం ఈ లగ్జరీ వాహనాల కోసం ఆర్డర్ గత ప్రభుత్వమే చేసిందని చెప్పుకొచ్చారు. ఇక పీవోకే ప్రభుత్వం ఆర్డర్ చేసిన వాహనాల్లో మెర్సిడెస్, మ్యాటిక్ సెడాన్ వంటి అన్ని వాహనాలు ఉన్నాయి.
కొత్త లగ్జరీ కారును కొనుగోలు చేసేందుకు పీఓకే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీఓకే అధ్యక్షుడు బారిస్టర్ సుల్తాన్ మహమూద్ ఈ కార్ల కోసం ఆర్డర్ ఇచ్చారని గతంలో స్థానిక మీడియా పేర్కొంది. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో ప్రజలు తమ నిరసన వ్యక్తం చేయడం చేయడం ప్రారంభించారు. పాకిస్థాన్‌లోని ప్రజల వద్ద విషం తినడానికి డబ్బు లేదని.. అయితే ఇస్లామాబాద్ నుండి ముజఫరాబాద్ వరకు విలాసవంతమైన అవకాశాన్ని వదిలిపెట్టడం లేదని ఆరోపించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.