భారత్‌పై కాలుదువుతున్న పాకిస్థాన్...మరో యుద్ధానికి సన్నాహాలు...

భారత భూభాగంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నిర్మిస్తున్న కిషన్ గంగా, రాటిల్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం ఆపివేయాలని పాకిస్థాన్ డిమాండ్ చేస్తోంది.


Updated: March 27, 2019, 2:03 PM IST
భారత్‌పై కాలుదువుతున్న పాకిస్థాన్...మరో యుద్ధానికి సన్నాహాలు...
ప్రతీకాత్మక చిత్రం

Updated: March 27, 2019, 2:03 PM IST
భారత్‌పై పాక్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందా...అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సారి సైనిక యుద్ధం కాదని నీటి కోసం యుద్ధం చేసేందుకు పాక్ సిద్ధమవుతోంది. పాకిస్థాన్ కు చెందిన రెండు పార్లమెంటరీ కమిటీలు భారత భూభాగంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నిర్మిస్తున్న కిషన్ గంగా, రాటిల్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం ఆపివేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు జీలం, చీనాబ్ నదులపై నిర్మిస్తున్నారు.

ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా భారత్ ఇరు దేశాల మధ్య ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అయ్యిందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. దీనిపై వరల్డ్ బ్యాంకుకు పాకిస్థాన్ ఒక కోర్టు ఆర్బిట్రేషన్ ఏర్పాటు చేయాలని కోరింది. తద్వారా ఇరు దేశాల జలాలపై నెలకొన్న వివాదం పరిష్కరించాలని విన్నవించింది.

వరల్డ్ బ్యాంకు ఆర్బిట్రేషన్ కోర్టు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించనంత వరకూ ఈ రెండు హైడల్ ప్రాజెక్టులను అడ్డుకోవాలని పాకిస్థాన్ కోరింది. భారత్ సింధుజలాల ఒప్పందాలను ఉల్లంఘిస్తుంటే చూస్తూ ఊరుకోమని పాకిస్తాన్ పార్లమెంటరీ కమిటీకి నేత్రుత్వం వహిస్తున్న ఇజాజ్ చౌదరి పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే భారత్ నిర్మిస్తున్న 45 నుంచి 60 నీటి ప్రాజెక్టులకు పాక్ తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. పాకిస్థాన్ విద్యుత్ శాఖా మంత్రి యూనుస్ దఘా భారత్ నిర్మిస్తున్న ప్రాజెక్టులు అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వరల్డ్ బ్యాంక్ వెంటనే ఆర్బిట్రేషన్ ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ డిమాండ్ చేస్తోంది.

First published: March 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...