పాకిస్థాన్ టీవీ చానెల్ తెరపై భారత జెండా ప్రత్యక్షం...షాక్ లో పాకీ మీడియా...

పాకిస్తాన్ మీడియా ప్రకారం, ఈ హ్యాకింగ్ వెనుక భారత హ్యాకర్లు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ విషయంలో డాన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

news18-telugu
Updated: August 3, 2020, 3:05 PM IST
పాకిస్థాన్ టీవీ చానెల్ తెరపై భారత జెండా ప్రత్యక్షం...షాక్ లో పాకీ మీడియా...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ మీడియా హౌస్ డాన్ న్యూస్ వ్యవస్థ మొత్తం హ్యాక్ అయ్యింది. సమాచారం ప్రకారం, డాన్ న్యూస్ ఛానల్ ఆదివారం సాధారణంగా ప్రసారం అవుతుండగా, సడెన్ గా దాని ప్రసారం ఆగిపోయింది స్క్రీన్ పై భారత జెండా కనిపించడం ప్రారంభమైంది. స్వాతంత్ర్య దినోత్సవ సందేశం కూడా ఈ త్రివర్ణంపై వ్రాసి ఉంది. ఈ మొత్తం సంఘటన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పాకిస్తాన్ మీడియా ప్రకారం, ఈ హ్యాకింగ్ వెనుక భారత హ్యాకర్లు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ విషయంలో డాన్ ఒక ప్రకటన విడుదల చేసింది, మొత్తం ఎపిసోడ్ దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపింది. అందుకున్న సమాచారం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో పాకిస్తాన్ డాన్ న్యూస్ ఛానెల్‌లో ఈ ప్రకటన ప్రసారం అవుతోంది. అదే సమయంలో, టెలివిజన్ తెరపై అకస్మాత్తుగా త్రివర్ణ పతాకం రెప రెపలాడుతూ కనిపించింది. దానిపై హ్యాపీ ఇండిపెండెన్స్ డే సందేశం కూడా వ్రాసిఉంది.




డాన్ న్యూస్ ప్రకారం.. ఇది హ్యాకర్ల పనే అని డాన్ న్యూస్ ఒక ప్రకటన విడుదల చేసింది, దీనికి ముందే, భారతీయ హ్యాకర్లు తమ ఛానల్ వ్యవస్థలపై దాడి చేస్తున్నారని తెలిపింది. హ్యాకింగ్ కు గురైన తర్వాత తమ సాంకేతిక నిపుణులు కొద్ది నిమిషాల్లోనే పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకొని ప్రసారాలను స్టార్ట్ చేయడం మొదలు పెట్టారని తెలిపింది.కాగా ఈ మొత్తం విషయంపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది.ఈ వీడియో ఛానెల్‌లో ఎంతసేపు హ్యాకింగ్ కు గురైందో ఇంకా చెప్పలేదు. ఇదిలావుండగా, ఈ కేసుపై తక్షణ దర్యాప్తునకు డాన్ మేనేజ్ మెంట్ ఆదేశించినట్లు డాన్ న్యూస్ ఉర్దూలో ట్వీట్ చేసింది.
Published by: Krishna Adithya
First published: August 3, 2020, 3:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading