హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Pakistan: కశ్మీర్ సమస్య పరిష్కారం లేకుండా శాంతి సాధ్యం కాదు.. పాక్ కొత్త ప్రధాని షెహబాజ్ కీలక వ్యాఖ్యలు.

Pakistan: కశ్మీర్ సమస్య పరిష్కారం లేకుండా శాంతి సాధ్యం కాదు.. పాక్ కొత్త ప్రధాని షెహబాజ్ కీలక వ్యాఖ్యలు.

షెహబాజ్ షరీఫ్ (ఫైల్)

షెహబాజ్ షరీఫ్ (ఫైల్)

Shahbaz Sharif: పాక్ లో నెలకొన్న రాజకీయ అస్థిరతకు ఎండ్ కార్డ్ పడింది. మూడు సార్లు పాక్ కు ప్రధానిగా పని చేసిన నవాబ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ పాక్ కు నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు.

Pakistan new pm hahbaz sharif: పాకిస్థాన్ కు ప్రస్తుతం నూతన ప్రధానిగా షెహబాజ్ ఖాన్ ఎన్నుకొబడ్డారు. ఆయన నవాబ్ షరీఫ్ సోదరుడు. మూడు సార్లు పాక్ కు ప్రధానిగా పనిచేశారు. ఈయనకు మోదీతో మంచి స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించారు. ఈ క్రమంలో.. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ ఖాన్ తో.. మన దేశానికి ఎలాంటి సంబంధాలు ఉంటాయనే దానిపై నిపుణులు చర్చిస్తున్నారు. తాజాగా, పాకిస్తాన్‌లో (Pakistan) చోటు చేసుకున్న అధికార మార్పుల వలన ఆహ్వనించదగ్గ పరిణామాలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా ఇమ్రాన్ ఖాన్.. విదేశాంగ విధానాన్ని పూర్తిగా నాశనం చేశారని నిపుణులు భావిస్తున్నారు.

ఇమ్రాన్ ప్రధాని అయ్యాక భారత్, పాక్ సంబంధాలు (India pak friendly relations) పూర్తిగా దిగజారాయి. కానీ గతంలో.. నవాబ్ షరీఫ్ మన దేశ ప్రధానితో మంచి సంబంధాలను కొనసాగించారు. ఆయన మన దేశంతో స్నేహపూర్వకంగా మెలిగారు. అయితే, ప్రస్తుతం దీనిపై కొంత మంది పలు ఆరోపణలు కూడా చేస్తున్నారు. షెహబాజ్ మోదీకా యార్ అంటూ కామెంట్ లు చేస్తున్నారు. షెహబాజ్ ప్రధానిగా పాక్ విదేశాంగ విధానంలో అనేక మార్పులు జరుగుతాయని ఆయన సన్నిహితులు తెలిపారు.

భారత్ కు, పాక్ కు ఉన్న వివాదాలు స్నేహపూర్వకంగా పరిష్కరించుకునే దిశలో చర్యలు చేపడతారని ఆయన సన్నిహితులు అన్నారు. తమ నాయకుడు కొత్త విజన్ తో దేశంలో పాలన అందిస్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలో.. పీఎంఎల్-ఎన్ అధికార ప్రతినిధి ఉజ్మా బుఖారీ పలు వ్యాఖ్యలు చేశారు. షెహబాజ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కశ్మీర్‌కు (Jammu kashmir)  ప్రత్యేక హోదాను పునరుద్ధరించేలా భారత్‌పై ఒత్తిడి తెస్తామన్నారు. ఇంతలో, షెహబాజ్ పాకిస్తాన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. "మేము భారతదేశంతో శాంతిని కోరుకుంటున్నాము, కానీ కశ్మీర్ (special status) సమస్య పరిష్కారం లేకుండా శాంతి సాధ్యం కాదు." అని అన్నారు.


ఇమ్రాన్‌ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ సందర్భంగా శనివారం అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పదవిని కాపాడుకునేందుకు చివరి వరకు ఇమ్రాన్‌ ఖాన్ (Imran khan) అన్ని ప్రయత్నాలు చేశారు. ఏప్రిల్‌ 3న పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ సమావేశం జరిగినా..ఇది విదేశీ కుట్ర అని పేర్కొంటూ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించకుండా డిప్యూటీ స్పీకర్‌ తిరస్కరించడం వల్ల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 10 :30 గంటలకు మొదటి సారి భేటీ అయిన సభ మధ్యాహ్నం 12.30 వరకు వాయిదా పడింది. అనంతరం 3 గంటల వరకు ఒకసారి, రాత్రి 8గంటల వరకు మరోసారి వాయిదా పడింది. ఆ తర్వాత సమావేశమైనా మరో రెండు సార్లు వాయిదా పడి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు వాయిదా పడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పాక్‌ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాసంపై ఓటింగ్‌ జరగకపోతే కేసును మళ్లీ విచారించేందుకు వీలుగా సుప్రీంకోర్టును అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచారు.

First published:

Tags: Imran khan, India pakistan, Pakistan

ఉత్తమ కథలు