ఉగ్రవాదులకు వందల కోట్లు ఇచ్చాం.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

Pak | Imran Khan | జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమంని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వ్యాఖ్యానించిన కొద్దిరోజులకే మరో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. హఫీజ్ సయీద్ నేతృత్వంలోని నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా (జేయూడీ) కోసం ప్రభుత్వం రూ.వందల కోట్లు ఖర్చు చేసిందని అంతర్గత వ్యవహారాల మంత్రి ఇజాజ్ అహ్మద్ షా వెల్లడించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 12, 2019, 5:25 PM IST
ఉగ్రవాదులకు వందల కోట్లు ఇచ్చాం.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (File photo/AP)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 12, 2019, 5:25 PM IST
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్తానే.. అంటూ భారత్ ఏళ్లుగా అంతర్జాతీయ సమాజం ముందు వాదిస్తోంది. అందుకు తగ్గట్లు ఆధారాలు చూపిస్తూనే పాక్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తోంది. నిధులు, ఆవాసం.. ఇలా పలు రూపాల్లో ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తోందని కళ్లకు కట్టేలా చూపిస్తోంది. దీంతో.. ప్రపంచ దేశాలు పాక్‌ను తప్పుబడుతూ, భారత్‌కు బాసటగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో పాక్ రాజకీయ నేతల వ్యాఖ్యలు కూడా ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమంని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వ్యాఖ్యానించిన కొద్దిరోజులకే మరో మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. హఫీజ్ సయీద్ నేతృత్వంలోని నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా (జేయూడీ) కోసం ప్రభుత్వం రూ.వందల కోట్లు ఖర్చు చేసిందని అంతర్గత వ్యవహారాల మంత్రి ఇజాజ్ అహ్మద్ షా వెల్లడించారు.

పాక్ మంత్రి ఇజాజ్ అహ్మద్ షా


పాకిస్తాన్‌‌లోని ఓ ప్రైవేటు మీడియాతో మాట్లాడుతూ.. ‘జేయూడీపై కోట్లాది రూపాయలు ఖర్చు చేశాం. నిషేధిత ఉగ్ర సంస్థలకు ఉగ్రవాదులను దూరం చేసి, జనజీవన స్రవంతిలోకి తీసుకు రావాల్సి ఉంది. ఉగ్రవాదులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చేలా వీటిని ఖర్చు చేశాం’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ దేశంలో 30 వేల నుంచి 40 వేల మంది ఉగ్రవాదులు ఉన్నారంటూ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. సరిహద్దు ప్రాంతాల్లో 40 రకాల ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయని కూడా పాక్ ప్రధాని మరో కార్యక్రమంలో పేర్కొన్నారు.

First published: September 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...