ఇస్లామాబాద్ పాకిస్థాన్‌లో అధికారం నుంచి గద్దె దించిన తర్వాత కొత్త ప్రభుత్వంపై ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)నిరంతరం దాడి చేస్తూనే ఉన్నారు. మరోవైపు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం కూడా మాజీ ప్రధానిపై కొత్త ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు పాకిస్థాన్‌లోని(Pakistan) అతిపెద్ద పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన హోంమంత్రి అటా తరాద్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ మొదటి నుంచి డ్రగ్స్‌కు బానిస అని ఆయన ఆరోపించారు. ఇమ్రాన్‌కు ఎవరు డ్రగ్స్ సరఫరా చేస్తారో ప్రభుత్వానికి తెలుసని అన్నారు. చరస్, కొకైన్ లేకుండా ఇమ్రాన్ రెండు గంటలు కూడా ఉండలేడని తరాద్ ఆరోపించారు. ఇమ్రాన్ డ్రగ్స్‌కు బానిసగా ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. 2020లో ఇమ్రాన్ సన్నిహితుడు, పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ సర్ఫరాజ్ నవాజ్ కూడా ఇదే ఆరోపణలను టీవీల్లో బహిరంగంగా చేశాడు. తర్వాత ఇమ్రాన్ రెండో విడాకులు తీసుకున్న భార్య రెహమ్ కూడా ఖాన్‌ను డ్రగ్స్‌కు బానిస అని చెప్పింది.
మాదకద్రవ్యాలు తీసుకున్నందుకు ఇమ్రాన్‌ను తాము ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చని మంత్రి తరాద్ అన్నారు. కానీ ఇలా చేయకూడదనుకుంటున్నామని అన్నారు. ఆయన మత్తు లేకుండా జైల్లో ఎలా ఉండగలుగుతాడా ? వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న బనిగాల విలాసవంతమైన ఇంటికి ఎవరు డ్రగ్స్ రవాణా చేస్తారో తెలుసు అని తరాద్ కామెంట్ చేశారు. ఆయన వ్యసనం గురించి మనం ఎందుకు మాట్లాడకూడదని ప్రశ్నించారు. ఇమ్రాన్ క్రికెటర్‌గా ఉన్నప్పటి నుండి చరస్‌లను ఉపయోగిస్తున్నాడని ఆరోపించారు.
ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ, పరారీలో ఉన్న అతని స్నేహితురాలు ఫరా ఖాన్ వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని న్యాయ మంత్రి మాలిక్ మహ్మద్ అహ్మద్ ఖాన్ అన్నారు. రూ.60 కోట్ల విలువైన భూమిని రూ.8 కోట్లకు కొనుగోలు చేశారని.. అది కూడా భూమి కొనలేని ప్రాంతంలో చేశారని వ్యాఖ్యానించారు. దానిపై విచారణ జరుగుతోందని అన్నారు.
బీర్ తాగడం వలన కిక్కు మాత్రమే కాదు.. బోలేడు లాభాలు.. పోర్చుగీస్ యూనివర్శిటీ ఏం చెప్పిందంటే..
Trending: పాకిస్థాన్‌కు ఇదేం పిచ్చిరా బాబూ.. భారత్‌తో పోటీ పడేందుకు ఇలా కూడా చేస్తారా ?
బుష్రా ఇమ్రాన్ ఇంటి మహిళ అయితే.. ఆమె రాజకీయ ఆడియో ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతోందని ప్రశ్నించారు. ఇందులో ఆమె మాలాంటి నేతలందరినీ దేశద్రోహులు అంటోందని విమర్శించారు. ఎప్పుడైతే ఇమ్రాన్ అవినీతి తెరపైకి వచ్చిందో, ప్రభుత్వం పడిపోతుందో, అప్పుడే విదేశీ కుట్ర అంటూ డ్రామా రచించడం మొదలుపెట్టాడని మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Imran khan, Pakistan