హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

పగోడు పొగుడుతుంటే ఆ కిక్కే వేరప్పా : మోదీ నాయకత్వంలో భారత్ దూసుకెళ్తోంది..పాక్ మీడియా ప్రశంసల వర్షం

పగోడు పొగుడుతుంటే ఆ కిక్కే వేరప్పా : మోదీ నాయకత్వంలో భారత్ దూసుకెళ్తోంది..పాక్ మీడియా ప్రశంసల వర్షం

ప్రధాని నరేంద్ర మోదీ(ఫైల్ ఫొటో)

ప్రధాని నరేంద్ర మోదీ(ఫైల్ ఫొటో)

Pak media praises PM Modi :ప్రపంచవ్యాప్తంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi)కి లభిస్తున్న ఆదరణ, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Pak media praises PM Modi :ప్రపంచవ్యాప్తంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi)కి లభిస్తున్న ఆదరణ, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలో ప్రపంచ నేతగా ఎదిగిన మోదీకి ఎన్నో దేశాల మీడియాలు పట్టంగట్టాయి. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి భారత్​(India)ను శత్రుదేశంగా భావించే పాకిస్తాన్(Pakistan) కూడా చేరింది. పాకిస్తాన్‌ లో విదేశీ మారక నిల్వలు తగ్గిపోయి ధరలు ఆకాశానికి అంటుతూ గోధుమ పిండి కోసం కూడా భారీ క్యూలు, తొక్కిసలాటలు జరిగి సామాన్యులు చచ్చిపోతు నానా తంటాలు పడుతున్న ప్రస్తుత తరుణంలో(Pakistan crisis) ఆ దేశ మీడియా మన ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం.

పాక్​ కు చెందిన ప్రముఖ వార్తాసంస్థ "ది ఎక్స్​ప్రెస్​ ట్రిబ్యూన్"..మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకుంటోందని ఒపీనియన్​ కాలంలో ఓ భారీ వ్యాసాన్ని ప్రచురించింది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత దేశం అంతర్జాతీయంగా ఎలా ఎదుగుతోంది అన్న విషయంపై పాకిస్తాన్ ​లోని షహజాద్ చౌధరి అనే ప్రముఖ రాజకీయ, భద్రత, రక్షణ విశ్లేషకుడు కథనం రాశారు. ప్రపంచంపై తన ప్రభావాన్ని చూపించే స్థితికి మోదీ భారత్​ ను తీసుకెళ్లారని కథనంలో కీర్తించారు. భారత దేశ పురోగతి ప్రపంచాన్ని అబ్బుపరుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ నేతృత్వంలోని భారత దేశం విదేశీ విధానాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుందని పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలో భారత్ ఎంతో నైపుణ్యంగా వ్యవహరించి తన జీడీపీని 3 ట్రిలియన్​ డాలర్లకు పెంచుకుందని, అభివృద్ధి పథంవైపు దూసుకెళుతోందని ఆ కథనంలో తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు రికార్డు స్థాయిలో అత్యుత్తమ స్థాయికి పెరిగాయని, ఐటీ పరిశ్రమ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో విస్తరించిందని రాశారు. వ్యవసాయంలో ఎకరానికి ఇండియా ఉత్పత్తి చేస్తున్న పంట ప్రపంచంలోనే మెరుగైన దశలో ఉందన్నారు. మోదీ స్వయంగా భారత్‌కు బ్రాండ్ తీసుకువచ్చేందుకు నడుం కట్టి విజయవంతమయ్యారని కథనంలో పేర్కొన్నారు. భారత దేశ బ్రాండ్​ను మోదీ పెంచినంతంగా మరే ఇతర ప్రధాని కూడా పెంచలేదన్నారు. కాల పరీక్షకు తట్టుకుని భారత ప్రజాస్వామ్యం దృఢంగా నిలిచిందని ప్రశంసించారు. పాక్‌లో నెలకొన్ని పరిస్థితులను ఉద్దేశిస్తూ ఆ దేశం అవలంబిస్తున్న ఆర్ధిక విధానాలను, విదేశాంగ నీతిపై ఆ కథనంలో విరుచుకుపడ్డారు.

దేశంలోని 5 చౌకైన, ప్రసిద్ధ మార్కెట్లు..ఇక్కడ మీరు తక్కువ బడ్జెట్‌లో చాలా షాపింగ్ చేయవచ్చు

పాక్ మీడియా గతంలో నరేంద్ర మోదీ విధానాలను తీవ్రంగా విమర్శించేది. గోద్రా అల్లర్ల ఘటన నుంచి ఆర్టికల్ 370 రద్దు వరకూ అన్ని నిర్ణయాలనూ పాక్ మీడియా తప్పుబట్టేది. ప్రస్తుతం అదే మీడియా మోదీ నాయకత్వాన్ని వేనోళ్ల పొగడుతుంది. పాక్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా కొంతకాలంగా మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాలను ప్రశంసిస్తూ వస్తున్నారు. భారత విదేశాంగ విధానం స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరిస్తుందని మెచ్చుకున్నారు. అమెరికా సహా పలు దేశాల నుంచి వ్యతిరేకత,ఒత్తిడి వచ్చినా రష్యా నుంచి భారత్ ఆయిల్ దిగుమతి చేసుకోవడాన్ని ఇమ్రాన్ చాలాసార్లు ప్రస్తావించారు.

First published:

Tags: Pakistan, Pm modi

ఉత్తమ కథలు