హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

అంతర్జాతీయ ఒత్తిళ్లు...మసూద్ అజర్‌కు షాక్ ఇవ్వనున్న పాక్

అంతర్జాతీయ ఒత్తిళ్లు...మసూద్ అజర్‌కు షాక్ ఇవ్వనున్న పాక్

JeM Chief Masood Azhar | దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉండడంతో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను వెనకేసుకురాకూడదని పాకిస్థాన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వ్యక్తులకంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని, అందుకే ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో మార్పులు ఉండే అవకాశముందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

ఇంకా చదవండి ...

  అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌కు మద్దతు కొనసాగించే విషయంలో పాకిస్థాన్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రతిపాదనకు గత్యంతరంలేని పరిస్థితుల్లో పాకిస్థాన్ కూడా మద్దతిచ్చే అవకాశముంది. భారత్ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలకు తమ గడ్డను వాడుకునేందుకు అనుమతివ్వబోమని ఇప్పటికే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. దీన్ని ఆచరణలో పెట్టాలంటూ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర పలు ప్రపంచ దేశాలు పాకిస్థాన్‌కు హితవుపలికాయి. ఈ నేపథ్యంలో పుల్వామా ఉగ్రదాడి ఘటనకు పాల్పడిన జైషే మొహమ్మద్‌తో పాటు మరికొన్ని ఉగ్రవాద సంస్థలపై ‘కఠిన చర్యలు’ తీసుకునేందుకు పాక్ సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

  దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉండడంతో మసూద్ అజర్‌ను వెనకేసుకురాకూడదని పాక్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వ్యక్తులకంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని, అందుకే ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో మార్పులు ఉండే అవకాశముందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. మదూస్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం ద్వారా భారత్‌ను శాంతింపజేయొచ్చని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించొచ్చని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రతిపాదన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ముందుకు వచ్చినప్పుడు దీన్ని వ్యతిరేకించకూడదని పాక్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐరాస భద్రతా మండలిలో వీటో అధికారం కలిగిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ బుధవారం కొత్తగా ప్రతిపాదన తీసుకొచ్చాయి. 15 సభ్య దేశాలు కలిగిన ఐరాస భద్రతా మండలిలో ఇది మరో 10 రోజుల్లో మరోసారి పరిశీలనకు రానుంది.

  మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ప్రతిపాదన ఐరాస భద్రతా మండలి పరిశీలనకు రానుండడం గత 10 ఏళ్లలో ఇది నాలుగోసారి. వీటో అధికారం కలిగిన చైనా వ్యతిరేకిస్తుండడంతో ఈ ప్రతిపాదనకు ఐరాస భద్రతామండలి ఆమోదం లభించడం లేదు. మారిన పరిస్థితుల కారణంగా మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చే ప్రతిపాదనకు ఐరాస భద్రతా మండలి ఆమోదిస్తే..ఆయన అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించడంతో పాటు ఆయన ఆస్తులను స్తంభింపజేస్తారు. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తే అది భారత్ దౌత్య విజయమే అవుతుంది.

  First published:

  Tags: India VS Pakistan, Jammu and Kashmir, Masood Azhar, Pulwama Terror Attack, Surgical Strike 2

  ఉత్తమ కథలు