పాకిస్తాన్ గనిలో ఘోర ప్రమాదం.. 22 మంది కార్మికులు దుర్మరణం

ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న సాఫి పట్టణ శివారులో జియారత్ ఘర్ పర్వత శ్రేణులున్నాయి. ఇక్కడ అత్యుత్తమ మార్బుల్ (చలువరాయి) లభిస్తుంది.

news18-telugu
Updated: September 9, 2020, 10:50 AM IST
పాకిస్తాన్ గనిలో ఘోర ప్రమాదం.. 22 మంది కార్మికులు దుర్మరణం
ఘటనా స్థలంలో సహాయక చర్యలు (Image:(Reuters))
  • Share this:
పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జియారత్ ఘర్ పర్వత శ్రేణుల్లో ఉన్న చలువరాతి గనులు కుప్పకూలాయి. ఈ ఘటనలో 22 మంది కార్మికులు మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద ఇంకా పలువురు కార్మికులు ఉండడంతో వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల్లో 12 మంది మైనర్లు ఉన్నట్లు స్థానిక జియో న్యూస్ వెల్లడించింది.

ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న సాఫి పట్టణ శివారులో జియారత్ ఘర్ పర్వత శ్రేణులున్నాయి. ఇక్కడ అత్యుత్తమ మార్బుల్ (చలువరాయి) లభిస్తుంది. ఇక్కడి గనుల్లో వందలాది కార్మికులు పనిచేస్తుంటారు. సోమవారం రాత్రి మొత్తం 6 యూనిట్లలోని గనులు కూప్పకూలాయని.. ఇప్పటికీ చాలా మంది కార్మికులు శిథిలాల కిందే ఉన్నారని అధికారులు తెలిపారు. భారీ యంత్రాల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నామని చెప్పారు. శిథిలాల తొలగింపు పూర్తైన తర్వాతే ఎంత మంది చనిపోయారన్న దానిపై స్పష్టత వస్తుందని వెల్లడించారు. ఈ ఘటనతో ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: September 9, 2020, 10:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading