త్వరలో పాస్‌పోర్ట్ లేకుండా పాకిస్థాన్‌కు ప్రయాణం

కర్తార్‌పూర్‌ కారిడార్‌లోకి పాసుపోర్టు లేకుండా భారతీయ యాత్రికులను అనుమతించే అవకాశంపై ఆ దేశ పార్లమెంటులో చర్చ జరిగింది.

news18-telugu
Updated: February 9, 2020, 11:02 PM IST
త్వరలో పాస్‌పోర్ట్ లేకుండా పాకిస్థాన్‌కు ప్రయాణం
కర్తార్‌పూర్ సాహిబ్
  • Share this:
కర్తార్‌పూర్‌ కారిడార్‌లోకి పాసుపోర్టు లేకుండా భారతీయ యాత్రికులను అనుమతించే అవకాశంపై ఆ దేశ పార్లమెంటులో చర్చ జరిగింది. దీనిపై పాక్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి ఇజాజ్‌ షా ఆ దేశ పార్లమెంట్‌లో ఈ తెలిపారు. దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను ఎక్కువ మంది యాత్రికులు సందర్శించేందుకు వీలుగా ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సిక్కుల గురువైన గురునానక్‌ తన జీవితంలో ఎక్కువకాలం గడిపిన పాక్‌లోని దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాను భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రం గురుదాస్‌పూర్‌లోని ప్రసిద్ధ డేరా బాబా నానక్‌ను కలుపుతూ నిర్మించిన కారిడార్‌ను గత ఏడాది నవంబర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారం భారత పాసుపోర్టు కలిగిన యాత్రికులను కర్తార్‌పూర్‌ కారిడార్‌లోకి పాక్‌ అనుమతిస్తున్నది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖను కోరినట్లు జాతీయ అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన పేర్కొన్నారు.

First published: February 9, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు